Coronavirus: ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 9 వేలకు చేరిన రోజువారీ కేసుల సంఖ్య

Coronavirus: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించి గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ..

Coronavirus: ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 9 వేలకు చేరిన రోజువారీ కేసుల సంఖ్య
Follow us
Subhash Goud

|

Updated on: Feb 24, 2021 | 10:41 PM

Coronavirus: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించి గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలోనే కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలలో మొదటి స్థానంలో ఉన్నమహారాష్ట్రలో తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇక కేసుల సంఖ్య ఇలాగే ఉంటే మరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించక తప్పదని ఇప్పటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మహారాష్ట్రలో వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 9వేలకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,807 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 80 మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,21,119కి చేరగా, మరణాల సంఖ్య 51,937కు చేరింది.

మరో వైపు గత 24 గంటల్లో 2,772 మందికి కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 20,08,623కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 59,358 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్న అమరావతి జిల్లాలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి.

Also Read: కరోనా వైరస్ తో ప్రముఖ పంజాబీ సింగర్ సికిందర్ మృతి, సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ సంతాపం

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్