కరోనా వైరస్ తో ప్రముఖ పంజాబీ సింగర్ సికిందర్ మృతి, సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ సంతాపం

పంజాబ్ లో ప్రముఖ సింగర్ సర్దూల్  సికిందర్ కరోనా వైరస్ తో మరణించారు. ఆయన నెలరోజులుగా మొహలీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు...

  • Umakanth Rao
  • Publish Date - 4:14 pm, Wed, 24 February 21
కరోనా వైరస్ తో ప్రముఖ పంజాబీ సింగర్ సికిందర్ మృతి, సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ సంతాపం

పంజాబ్ లో ప్రముఖ సింగర్ సర్దూల్  సికిందర్ కరోనా వైరస్ తో మరణించారు. ఆయన నెలరోజులుగా మొహలీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ  సమస్యను ఎదుర్కొన్న ఆయనకు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ, కరోనా వైరస్ కారణంగా నిన్న ఉదయం మృతి చెందారు. జానపద, పాప్ గీతాలను ఆలపించే సికిందర్ కొన్ని చిత్రాల్లోనూ నటించారు. ఎన్నో హిట్ పాటలు పాడారు. ఆయన మృతి పట్ల పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు. సికిందర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక మధుర స్వరం మూగబోయిందని వీరు ట్వీట్ చేశారు.

Also Read:

ఏడవ విడత హరితహారంపై సమీక్ష.. వీలైనన్ని పెద్ద మొక్కలను అన్ని శాఖల నర్సరీల్లో సిద్దం చేయాలని ఆదేశం

Nallamala Forest: ప్రతాపరుద్రుని కోటలో అసలేం జరుగుతోంది?.. జోరుగా చర్చించుకుంటున్న నల్లమల గ్రామాల ప్రజలు..