AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Skills Report 2021 జాబ్స్‌, ఆపర్చునిటీస్‌కి సిటీ కేరాఫ్‌, దేశమంతా ఇష్టపడే నగరాల్లో హైదరాబాదే‌ టాప్‌

మినీ ఇండియా హైదరాబాద్‌నే దేశమంతా ఇష్టపడుతోంది. భాగ్యనగరంలో కొలువుదొరికితే లైఫ్‌ సెటిలేనని యూత్‌ భావిస్తోంది. దేశంలో ఎన్నో నగరాలున్నా..

India Skills Report 2021 జాబ్స్‌, ఆపర్చునిటీస్‌కి సిటీ కేరాఫ్‌, దేశమంతా ఇష్టపడే నగరాల్లో హైదరాబాదే‌ టాప్‌
Venkata Narayana
|

Updated on: Feb 24, 2021 | 9:55 PM

Share

మినీ ఇండియా హైదరాబాద్‌నే దేశమంతా ఇష్టపడుతోంది. భాగ్యనగరంలో కొలువుదొరికితే లైఫ్‌ సెటిలేనని యూత్‌ భావిస్తోంది. దేశంలో ఎన్నో నగరాలున్నా ఎక్కువమంది యువత గ్రేటర్‌ సిటీకే తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఎక్కడెక్కడో ఉన్నత చదువులు చదివినా…అంతిమంగా ఉద్యోగంలో స్థిరపడేందుకు మాత్రం ఎక్కువమంది ఆప్షన్‌ హైదరాబాదే. దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, టాగ్డ్‌ .. సంయుక్తంగా రూపొందించిన ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ 2021లో హైదరాబాద్‌కే జిందాబాద్‌ అన్నారంతా. ఉద్యోగం చేయడానికి ఇష్టపడే నగరంగానే కాదు… ఎక్కువ ఉద్యోగావకాశాలున్న నగరాల్లోనూ.. హైదరాబాదే ముందుందంటోంది ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌.

హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, పుణె, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఎక్కువ అవకాశాలున్న నగరాలుగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా పారిశ్రామిక అవసరాలు, ఉద్యోగావకాశాలు, విద్యార్థుల సామర్థ్యాలపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్‌ నేషనల్‌ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతోపాటు 15 పరిశ్రమలు, 150కిపైగా కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించి… పలు అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదికని రూపొందించింది. క్రిటికల్‌ థింకింగ్‌లో టాప్‌ టెన్‌లో నాలుగో స్థానంలో నిలిచారు తెలంగాణ విద్యార్థులు. ఇంగ్లీష్‌ నైపుణ్యంలో ఐదో స్థానంలో ఉన్నారు. న్యూమరికల్‌ స్కిల్స్‌లో ఏపీ స్టూడెంట్స్‌ ఫిఫ్త్‌ ప్లేస్‌లో ఉంటే… తెలంగాణ విద్యార్థులు 8వ స్థానంలో ఉన్నారు. కంప్యూటర్‌ స్కిల్స్‌లో తెలంగాణ విద్యార్థులు 9వ స్థానంలో ఉన్నారు. మాతృభాష కాకుండా సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్, స్కిల్స్‌ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ ఫస్ట్‌ ప్లేస్‌ సాధించింది. కంప్యూటర్‌ స్కిల్స్‌లో పశ్చిమ బెంగాల్‌ రెండోస్థానంలో నిలిచింది.

Read also :

Bollineni, Sudharani : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎస్టీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం