Bollineni, Sudharani : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎస్టీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం
ఎట్టకేలకు అవినీతి అధికారుల పాపం పండింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎస్టీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం..
ఎట్టకేలకు అవినీతి అధికారుల పాపం పండింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎస్టీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని గ్రూప్ సంస్థలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవహారంలో జీఎస్టీ సూపరిండెంట్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాస గాంధీ 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనతో పాటు సుధారాణి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆరోపణల్లో నిజాలున్నట్లు తేలడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది.
హైదరాబాద్ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో బొల్లినేని సూపరింటెండెంట్‌గా పనిచేశారు. భరణీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇన్‌పుట్ క్రెడిట్ మంజూరు చేసేందుకు శ్రీనివాసగాంధీ 5 కోట్ల రూపాయలు లంచం అడిగాడు. ఈ మొత్తంలో రూ. 10 లక్షలు నగదు రూపంలో మిగతా సొమ్ము ఓపెన్ ప్లాట్, ఫ్లాట్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం విషయాలన్నింటినీ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. బీఎస్ గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులోనూ దర్యాప్తు జరుగుతోంది. పదేళ్లలో ఆయన కోట్ల రూపాయలు కూడబెట్టనట్లు సీబీఐ గుర్తించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.
బొల్లినేని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఉన్న సమయంలో సీఎం జగన్, సుజనా చౌదరి వంటి ప్రముఖుల కేసులను విచారించారు. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయంలో పన్ను ఎగవేత విభాగంలో సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో.. డిప్యూటీ కమిషనర్ సుధారాణితో కలిసి రెండు వేర్వేరు కేసుల్లో రూ.20 లక్షలు లంచం తీసుకున్నట్టు బీఎస్ గాంధీపై అభియోగాలున్నాయి. ఇన్ఫినిటీ మెటల్ ప్రోడక్ట్స్ గ్రూప్, ఇన్‌పుట్ క్రెడిట్ లిమిట్ కేసును దర్యాప్తు చేసిన సుధారాణి, గాంధీ.. ఆ కంపెనీ నిర్వాహకుల నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు సీబీఐ పేర్కొంది.
జీఎస్టీ ఎగవేత కేసులో శ్రీధర్ రెడ్డిని గతేడాది మార్చిలో అరెస్ట్ చేసిన సుధారాణి, గాంధీ.. ఆయన భార్యను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించి లంచం తీసుకున్నట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆ విషయంపై దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వలేదని శ్రీధర్ రెడ్డిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సమయంలో సుధారాణి జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత బీఎస్ గాంధీ సూపరిండెంట్ స్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్‌గా ప్రమోట్ అయ్యారు.
Read also : ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం.. ప్రైవేటీకరణతోనే దేశాభివృద్ది, ప్రభుత్వ రంగ సంస్థలపై తేల్చేసిన ప్రధాని మోదీ