ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా ఎపిసోడ్‌కి మనసును కదిలించే ఎండింగ్, బి ఫార్మసీ స్టూడెంట్ సూసైడ్ పై ఎన్నో అనుమానాలు

ఇప్పుడిది సెన్షేషనల్‌కే సెన్షేషనల్‌గా మారింది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో డైలీ సీరియల్‌గా సాగిన స్టోరీలో అలజడి. పోలీసు యంత్రాంగంతోనే ఆట ఆడుకున్న అమ్మాయి....

ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా ఎపిసోడ్‌కి మనసును కదిలించే ఎండింగ్, బి ఫార్మసీ స్టూడెంట్ సూసైడ్ పై ఎన్నో అనుమానాలు
Follow us

|

Updated on: Feb 24, 2021 | 7:51 PM

ఇప్పుడిది సెన్షేషనల్‌కే సెన్షేషనల్‌గా మారింది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో డైలీ సీరియల్‌గా సాగిన స్టోరీలో అలజడి. పోలీసు యంత్రాంగంతోనే ఆట ఆడుకున్న అమ్మాయి.. ఇంత ఈజీగా ఎలా సూసైడ్‌ చేసుకుంది? ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన అమ్మాయికి పేరెంట్స్ ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు? సైక్రియాట్రిస్ట్‌తో చేయించిన కౌన్సిలింగ్‌ వర్కౌట్‌ కాలేదా? తల్లిదండ్రులు చేసిన ఆ పూజలేంటి? ఈ ఇష్యూలో ప్రతి క్షణం టెన్షన్‌. టర్నింగ్‌ల మీద టర్నింగ్‌లు. 15 రోజుల క్రితం కిడ్నాప్ కథ. ఇప్పుడిలా సూసైడ్‌తో ఎండ్‌ కార్డు పడింది. ఈ నెల 10న కిడ్నాప్‌ డ్రామా అబద్దమా? నిజమా? అన్నది పక్కన బెడితే.. ఈ సూసైడ్ మాత్రం నిజం. ఘట్‌కేసర్ బి ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. అయితే అప్పడి కిడ్నాప్ ఎపిసోడ్‌ నుంచి ఇప్పటి సూసైడ్‌ వరకు అనేక అనుమానాలు, అంతకు మించిన కుదుపులు.

సదరు కిడ్నాప్ కేసులో సంచలనాలు చాలా తొంగి చూశాయి. యువతి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ రాత్రి అంతలా డ్రామా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఏదైనా ఉంటే.. తల్లిదండ్రులకు నచ్చ చెప్పుకోవాలి గాని.. ఇలా దొంగ డ్రామాలు ఎందుకు? ఒకరి కోసం డిపార్ట్‌మెంట్‌నే షేక్‌ చెయ్యాలా? ఎందుకు ఇంతలా తెగింపుకు పాల్పడాల్సి వచ్చింది? ఇలా రకరకాల సూటి పోటీ మాటలు రావడం, యువతి ఉంటున్న చుట్టు పక్కల కూడా అవహేళనగా చూడడంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు కనిపించింది. దీన్ని గమనించిన పోలీసులు, తల్లిదండ్రులు సైక్రియాట్రిస్ట్‌తో కౌన్సిలింగ్‌ ఇప్పించారు. వైద్యులతో కూడా పలు మార్లు ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. ఐనా యువతిలో మార్పు రాలేదు.

ఎలాగైనా మార్పు తీసుక రావాలన్న లక్ష్యంతో ఘట్‌కేసర్‌లో ఉన్న మేనమామ ఇంటిలో ఉంచుతున్నారు. అక్కడ కూడా పాత జ్ఞాపకాలే వెంటాడడంతో ఇంకా డీప్‌ డిప్రెషన్‌లోకి వెళ్లింది. తల్లిదండ్రులు మాత్రం నెమ్మదిగా మార్పు వస్తుందిలే అనుకున్నారు. అంతలోనే ఇంత పని చేసింది. మంగళవారం సాయంత్రం షుగర్‌ ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఉస్మానియాకు తరలించారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు.. అమ్మాయి డిప్రెషన్‌లో ఉందని ఇంటికి పంపారు. అటు తర్వాత మళ్లీ బుధవారం ఉదయం కూడా ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఉస్మానియాకు తరలించారు. ఆక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.

దాదాపు రెండు వారాల పాటు సైలెంట్‌గా ఉన్న అమ్మాయి ఇలా కావడం వెనుక ఉన్నమిస్టరీ ఏంటి? ఈ 15 రోజుల్లో ఏం జరిగింది? మానసిక సమస్య నుంచి బయటపడేయటానికి మంత్రాలు, తంత్రాలే మార్గమని పేరెంట్స్ భావించారా? డిప్రెషన్‌ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మంత్రగాళ్ల దగ్గరికి వెళ్లారా? హై క్వాలిఫైడ్‌ స్టూడెంట్‌ అయి ఉండి కూడా.. పూజలు, పురష్కారాలంటూ తాయత్తులు కట్టించుకున్నారా? ఇదే నిజమైతే.. ఈ మంత్రాలు, తంత్రాలు, తాయత్తుల తతంగ మంతా ఎక్కడ జరిగింది? ఏ మంత్రగాళ్లు వచ్చి పూజలు చేశారు? ఎన్ని రోజుల పాటు చేశారు? తల్లిదండ్రులే చేయించారా? లేక తెలిసిన బంధువులు బలవంతంగా చేశారా? ఫైనల్‌గా ఎవరు ఈ ఐడియా ఇచ్చారు?

ఏదీ ఎలా ఉన్నా.. ఈ విషయంలో చాలా అనుమానాలున్నాయి. కిడ్నాప్‌ డ్రామాకంటే.. ముందే యువతి డిప్రేషన్‌కు వెళ్లిందా? ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసా? మతి స్థిమితం లేకనే కిడ్నాప్‌ కథ అల్లిందా? ఆమెకు పిచ్చి పట్టిందని పూజలు, మంత్రాలు చేయించిందా? ఇంటిలో జరిగిన పూజలు, మంత్రాల వెనుక ఉన్న అసలు మతలబేంటి? అసలు సమస్యను పక్కనబెట్టి పేరెంట్స్‌ తప్పుడు మార్గంలో వెళ్లారా? టాబ్లెట్స్‌ మింగినా.. ఉస్మానియాలో చికిత్స ఎందుకు జరగలేదు? పోలీసులు ఇప్పించిన సైకియాట్రిక్‌ కౌన్సిలింగ్‌ పనిచేయలేదా? ఈ మృతితో సఖి కౌన్సిలింగ్‌ సెంటర్‌ల పనితీరు ప్రశ్నార్ధకమైందా? కౌన్సిలింగ్‌ పనిచేసి ఉంటే.. బి.ఫామ్‌ స్టూడెంట్‌ బతికి ఉండేదా? ఇలా రక రకాల కమెంట్స్‌ దీని చుట్టు అల్లుకుంటున్నాయి.

Read also : మమత టాప్ గేర్ : ‘తమ తల్లులు, కూతుళ్లను బొగ్గు దొంగలనడానికి అసలు నోరెలా వచ్చింది మోదీ.. మీకసలు చరిత్రే లేదు’