Rubber Shed: శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాల సర్వీసింగ్‌ కోసం రబ్బర్‌ షెడ్డు.. ఆసియాలోనే మొట్టమొదటిదట..!

Rubber Shed: రోజురోజుకు సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కారణంగా తక్కువ ఖర్చులతో ఎన్నో రకాలుగా ఉపయోగపడే పరికరాలను అందుబాటులోకి ...

Rubber Shed: శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాల సర్వీసింగ్‌ కోసం రబ్బర్‌ షెడ్డు.. ఆసియాలోనే మొట్టమొదటిదట..!
Follow us

|

Updated on: Feb 25, 2021 | 12:33 AM

Rubber Shed: రోజురోజుకు సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కారణంగా తక్కువ ఖర్చులతో ఎన్నో రకాలుగా ఉపయోగపడే పరికరాలను అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ షెడ్డును ఏర్పాటు చేశారు. విమానాల మరమ్మతుల కోసం శంషాబాద్‌ విమానాశ్రయంలో గాలి బుడగ లాంటి రబ్బరు షెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇన్‌ప్లేటబుల్‌ హ్యాంగర్‌గా పిలిచే ఈ గాలి బుడగ ఆసియాలోనే మొట్టమొదటిదని జీఎంఆర్‌ సంస్థ వెల్లడించింది. ఇక ఈ హ్యంగర్‌ను నిర్ణీత, ఆకస్మిక మరమ్మతులు, ఇంజన్‌ లేదా ల్యాండింగ్‌ గేర్‌ మరమ్మతులు వంటి పలు కార్యకలాపాలు కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే మామూలుగా రేకుల షెడ్డు లాంటివి ఏర్పాటు చేస్తుంటారు. కానీ శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో మాత్రం గాలి కొట్టిన భారీ బుడగ లాంటి రబ్బరు షెడ్డును ఏర్పాటు చేసింది. ఇక దీని షెడ్డు జీవితం కాలం 10నుంచి 15 సంవత్సరాలు ఉంటుందని తెలిపింది.

అలాగే ఈ షెడ్డును ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఉంటుంది. దీని ఖర్చు కూడా తక్కువే అని జీఎంఆర్‌ పేర్కొంది. పీవీసీతో చేసిన ఈ పాలిస్టర్‌ బేస్‌ హ్యాంగర్‌ మంటలకు తట్టుకునే విధంగా తయారు చేశారట. అలాగే కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఆటోమెటిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఉంటుందని వివరించారు. రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లో పర్యవేక్షించేలా ఉంటుందని తెలిపారు.

Also Read: పెచ్చులూడిన తెలంగాణ అసెంబ్లీ ఎలివేషన్.. భవనం పటిష్టంగానే ఉందన్న కార్యదర్శి నర్సింహాచార్యులు