హమ్మ ! ఎలుగూ ! ఎంత పని చేశావే ..? టీచరమ్మ కారునంతా పాడు చేశావే ! ఎంత నష్టం ? ఎంత కష్టం ?
అమెరికాలోని హూస్టన్ లో ఓ టీచరమ్మ కారును నల్ల ఎలుగు ఒకటి నాశనం చేసేసింది. అది చేసిన నిర్వాకానికి ఆమె లబోదిబో మంటోంది. నా కారు రిపేర్ కి ఎంత ఖర్చు పెట్టాలో, ఏమిటోనంటూ తెగ వర్రీ అవుతోంది...
అమెరికాలోని హూస్టన్ లో ఓ టీచరమ్మ కారును నల్ల ఎలుగు ఒకటి నాశనం చేసేసింది. అది చేసిన నిర్వాకానికి ఆమె లబోదిబో మంటోంది. నా కారు రిపేర్ కి ఎంత ఖర్చు పెట్టాలో, ఏమిటోనంటూ తెగ వర్రీ అవుతోంది. టెనెసీలో నివసించే మేరీ అనే ఈ టీచర్..హూస్టన్ లో స్కూల్లో పని చేస్తోంది. స్కూలు అకడమిక్ సెషన్ త్వరలో ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఆమె హూస్టన్ కి ప్రయాణమైంది. అక్కడి తన స్కూలు వద్ద కొంత దూరంలో తన కారును పార్క్ చేసి వెళ్ళింది. రాత్రి పొద్దుపోవడంతో స్కూల్లోనే ఉండిపోయింది. అయితే పార్క్ చేసిన కారులోకి ఎప్పుడు..ఎలా ప్రవేశించిందో గానీ ఓ నల్ల ఎలుగుబంటి ఎంటరైంది. మరి మేరీ కారు లాక్ చేసిందీ లేనిదీ తెలియలేదు. మొత్తానికి అది కారు డోర్ ని నేర్పుగా తెరచుకుని లోపల నక్కింది. అయితే బహుశా కారు డోర్స్ లాక్ కావడంతో మళ్ళీ బయటపడలేకపోయింది. దీంతో వాహనంలోని డాష్ బోర్డు, ఎయిర్ బ్యాగ్, రేడియో, వాహన అద్దాలు మొదలైనవాటిని ధ్వంసం చేసేసింది. తెలతెలవారుతుండగా మేరీ పెంపుడు కుక్క అదే పనిగా మొరగడంతో అనుమానం వచ్చిన ఆమె తన కారు వద్దకు వచ్చి చూసి అవాక్కయింది. లోపల ఎలుగు చిక్కుకుపోయి ఉంది. బయటకు రాలేక నానా అవస్థ పడుతోంది. భయంతో బిక్కచచ్చిపోయిన మేరీ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారు వచ్చి అతి కష్టం మీద కారు డోర్ తెరిచేసరికి ఎలుగు పారిపోయింది.
వాహనంలోని ముఖ్య భాగాలన్నీ ధ్వంసం కావడంతో ఏదో యాక్సిడెంట్ కి గురైనట్టు కనబడడంతో మేరీ బావురుమంది. అయితే తనకిష్టమైన ప్రోటీన్ బార్ ని మాత్రం అది తినకుండా వదిలేసిందని ఆమె చివర్లో సంబరపడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video