వాళ్ళు ఫైట్ చేయాల్సిందే ! ఆఫ్ఘన్ లో అమెరికా బలగాల ఉపసంహరణ నిర్ణయం మారదన్న జోబైడెన్
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు తమ పట్టు బిగించుకుంటున్నప్పటికీ.. ఆ దేశ భద్రతాదళాలు ఇక తమకు తాము వారిపై పోరాటం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. అక్కడ తమ దేశ సైనికులను ఉపసంహరించాలన్న తమ నిర్ణయం మారబోదని,
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు తమ పట్టు బిగించుకుంటున్నప్పటికీ.. ఆ దేశ భద్రతాదళాలు ఇక తమకు తాము వారిపై పోరాటం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. అక్కడ తమ దేశ సైనికులను ఉపసంహరించాలన్న తమ నిర్ణయం మారబోదని, ఇందుకు తాము చింతించడం లేదని ఆయన చెప్పారు. ఆఫ్గనిస్తాన్ లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో మరికొంత కాలం అమెరికా సేనలను ఉండనిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఇప్పటికే తాము 20 ఏళ్లుగా కొన్ని కోట్ల డాలర్లను ఖర్చు చేశామని, ఆఫ్ఘన్ సైనికదళాలకు శిక్షణ ఇవ్వడం, వారికీ అధునాతన ఆయుధాలను సమకూర్చడం వంటివి చేశామని ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ నాయకులు తమ దేశ రక్షణ కోసం ఒక్కటి కావాల్సిందేనని బైడెన్ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో తమ సైనికులు కూడా ఎంతోమంది మరణించడమో, గాయపడడమో జరిగిందన్నారు. తాలిబాన్లపై ఆ దేశ దళాలు పోరాడవలసిందే.. ఆ భద్రతా దళాలకు మేం ఆహారం, ఆయుధాలు, వేతనాలు కూడా ఇస్తున్నాం అని ఆయన చెప్పారు.
వారికి తమ వైమానిక దళ సాయం ఉంటుందని, నిజానికి తాలిబన్ల కన్నా వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ఆఫ్గనిస్తాన్ లో ఈ నెల 31 నాటికి లేదా సెప్టెంబరు 11 నాటికి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి కావలసి ఉంది. ప్రస్తుతం ఈ దేశంలో సుమారు 650 మంది అమెరికన్ సైనికులే ఉన్నారు. ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో తాలిబన్లు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ప్రొవిన్షియల్ రాజధానుల సంఖ్య ఏడుకు పెరిగింది. అటు ఆఫ్ఘన్ పరిస్థితిపై ఖతార్ లో జరగనున్న మూడు దేశాల సమావేశంలో పాల్గొనాలని ఇండియాకు ఆహ్వానం అందింది.
మరిన్ని ఇక్కడ చూడండి : ప్రాణాలకు తెగించి బావిలో పడ్డ పిల్లిని రక్షించిన యువతి..మహిళా సాహసంకు నెటిజన్లు ఫిదా..!:Woman Savs Cat Video.
నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్‌లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.