Expensive City 2021: ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన నగరం.. ఇక్కడ బతకడం చాలా కష్టం.. ఎందుకంటే..?
Expensive City 2021: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో మీకు తెలుసా..! దీని గురించి ఆలోచిస్తే చాలామంది లండన్, పారిస్, న్యూయార్క్, లాస్
Expensive City 2021: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో మీకు తెలుసా..! దీని గురించి ఆలోచిస్తే చాలామంది లండన్, పారిస్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, జ్యూరిచ్, సింగపూర్ లాంటి నగరాల పేర్లు చెబుతారు. కానీ వీటిలో ఏది కాదు. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఇజ్రాయెల్‌లో ఉంది. దాని పేరు టెల్ అవీవ్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్‌లో ఈ నగరం ఐదు స్థానాలు ఎగబాకి మొదటి సారి అగ్రస్థానంలో నిలిచింది.
ఇక్కడ నివసించడం చాలా ఖరీదు 173 నగరాల్లో వస్తువులు, సేవల ధరలను పోల్చి ఈ జీవన వ్యయ సూచిక ప్రకటించారు. టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్ ప్రధాన నగరం.1909లో యూదు వలసదారులు ఈ నగరాన్ని నిర్మించారు. సాధారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పెంచింది. దీనివల్ల టెల్ అవీవ్ ప్రపంచంలో నివసించడానికి అత్యంత ఖరీదైన నగరంగా మారింది. టెల్ అవీవ్ జాతీయ కరెన్సీ షెకెల్, డాలర్‌తో పోలిస్తే షెకెల్ బలపడటంతో పాటు రవాణా, కిరాణా వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకింది.
రెండో స్థానంలో పారిస్, సింగపూర్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో పారిస్, సింగపూర్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ జాబితాలో పారిస్, సింగపూర్ తర్వాత జ్యూరిచ్ తర్వాతి స్థానంలో ఉంది. హాంకాంగ్ ఐదో స్థానంలో, న్యూయార్క్ ఆరో స్థానంలో, జెనీవా నగరం ఏడో స్థానంలో నిలిచాయి. టాప్ 10 ఖరీదైన నగరాల జాబితాలో కోపెన్‌హాగన్, లాస్ ఏంజెల్స్, ఒసాకా నగరాలు ఎనిమిది, తొమ్మిది,10వ స్థానాల్లో నిలిచాయి. అయితే గత సంవత్సరం 2020 ఖరీదైన నగరాల స్థానంలో పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి.