AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ ఆరాధ్యుల జాబితా.. మోదీ, అమితాబ్, కోహ్లీ, షారూక్‌కు స్థానం

ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన (వరల్డ్ అడ్మర్మైడ్ మెన్‌ ) పురుషుల జాబితాలో భారత్ నుంచి నలుగురికి స్థానం దక్కింది. 42 దేశాల్లో యువ్‌గవ్‌ సంస్థ నిర్వహించిన సర్వే జాబితాను ప్రకటించారు.

ప్రపంచ ఆరాధ్యుల జాబితా.. మోదీ, అమితాబ్, కోహ్లీ, షారూక్‌కు స్థానం
Balaraju Goud
| Edited By: |

Updated on: Sep 27, 2020 | 2:59 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన (వరల్డ్ అడ్మర్మైడ్ మెన్‌ ) పురుషుల జాబితాలో భారత్ నుంచి నలుగురికి స్థానం దక్కింది. 42 దేశాల్లో యువ్‌గవ్‌ సంస్థ నిర్వహించిన సర్వే జాబితాను ప్రకటించారు. పురుషుల జాబితాలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నాలుగో స్థానం దక్కింది. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ (14వ స్థానం), భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (16వ స్థానం), బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (17వ స్థానం) కూడా ఈ జాబితాలో ఉన్నారు. మనదేశ వ్యాప్తంగా చూస్తే మోదీ టాప్‌లో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రతన్‌ టాటా, ఎం.ఎస్‌.ధోని ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ 7వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 9వ స్థానంలో నిలిచారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇందులో మొదటి స్థానంలో ఉండగా, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం బిల్‌ గేట్స్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌద్ధ మత గురువు దలైలామా 8వ స్థానం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (12వ స్థానం), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (15వ స్థానం), క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (18వ స్థానం)లకూ చోటు దక్కింది.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నామినేషన్లు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో రెండు ప్రశ్నల్ని అడిగ్గా.. వాటిలో ఒక్క సమాధానాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 42 దేశాల్లో 4,500 మందిని సర్వే చేసినట్లు యువ్‌గవ్‌ సంస్థ పేర్కొంది.

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!