డ్రాగన్ కుయుక్తి..! కోవిడ్ వ్యాక్సిన్ షాట్స్‌పై రహస్య ఒప్పందాలు?
డ్రాగన్ కంట్రీ చైనా చేస్తున్న తాజా పన్నాగం ఒకటి బయటపడింది. క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ షాట్స్‌ను చైనా.. తమ వేలాది మంది దేశస్తులకు..

China gives ‘unproven’ vaccine to thousands: డ్రాగన్ కంట్రీ చైనా చేస్తున్న తాజా పన్నాగం ఒకటి బయటపడింది. క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ షాట్స్‌ను చైనా.. తమ వేలాది మంది దేశస్తులకు ఇంజెక్ట్ చేస్తున్నట్లు ప్రపంచ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. వాటి సామర్ధ్యంపై ఇంకా స్పష్టత రాకముందే ఈ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. వాటి వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నా ఆపట్లేదని నిపుణులు అంటున్నారు. అంతేకాదు టీకా పొందినవారు తమ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండేలా.. రహస్య ఒప్పందంపై చైనా ప్రభుత్వం సంతకం చేయించిందట. వ్యాక్సిన్ పొందిన వారిలో ప్రభుత్వ అధికారులు, వ్యాక్సిన్ తయారీ కంపెనీ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. అత్యవసర ప్రాతిపదికన వారికి చైనా ప్రభుత్వం కోవిడ్ టీకాను ఇంజెక్ట్ చేసింది. దీనితో గ్లోబల్ హెల్త్ నిపుణులు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. టీకా ఇచ్చే ముందు వారి అంగీకారం తీసుకుంటున్నారా.? లేదా.? అని ప్రశ్నిస్తున్నారు.
జూలైలో చైనా ప్రయోగాత్మకంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రాంను మొదలుపెట్టింది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మద్దతు కూడా లభించిందని అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారి జెంగ్ జాంగ్‌వే వెల్లడించారు. జూన్‌లోనే డబ్ల్యూహెచ్‌ఓకు తాము సమాచారం అందించామని తెలిపారు. అలాగే ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా దేశాలు తమ అధికార పరిధిలో వైద్య ఉత్పత్తుల వాడకాన్ని ఆమోదించవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పిన విషయం విదితమే.
కాగా, చైనాలో ప్రస్తుతం క్లినికల్ ట్రయిల్స్ దశలో 11 కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయి. వాటిల్లో నాలుగు ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్నాయి. రెండు టీకాలను నేషనల్ బయోటెక్ గ్రూప్ అభివృద్ధి చేస్తుండగా.. ఒకదాన్ని సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. అటు కాన్సినో బయోలాజిక్స్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకాను చైనా మిలటరీలో ఉపయోగించడానికి జూన్‌లోనే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే.
Also Read:
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!
బ్రూసెల్లోసిస్… తస్మాత్ జాగ్రత్త.!
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..
కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!
