Breaking News
  • అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం జగన్ సమీక్ష . 2014 అంచనాల ప్రకారం 20398.61 మాత్రమే ఇరిగేషన్ కంపోనెంట్ కు చెల్లిస్తాం అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ. దీనిపై అంగీకారం తెలపాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఏ) ను కోరిన కేంద్ర ఆర్థిక శాఖ . 55448.87 కోట్ల రూపాయల వ్యయం కు ఆమోదం తెలిపిన పిపిఏ, సీడబ్లూసి. అందులో 47725.74 కోట్ల రూపాయలకు రివైస్డ్ కాస్ట్ కమిటీ, కేంద్ర జెల్ శక్తి ఆమోదం. అది ఆమోదించాలని ఆర్థిక శాఖను జల శక్తి శాఖ కోరిందని సీఎంకు వివరించిన అధికారులు .
  • పండుగ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉల్లి ను సబ్సిడీలో అందిస్తున్న ప్రభుత్వం. రైతుబజార్లలో కిలో ఉల్లి ముప్పై ఐదు రూపాయలకు సబ్సిడీలో అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మనిషికి రెండు కేజీల చొప్పున ఆధార్ కార్డ్ చూపిస్తే సబ్సిడీ ఉల్లి. ఉల్లి ధర అందుబాటులోకి వచ్చే వరకు ఈ సబ్సిడీ ఉల్లి కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. ఎస్టేట్ అధికారి రమేష్.
  • రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీ: ముగ్గురికి స్థాన చలనం. ఇద్దరికి అదనపు బాధ్యతలు. మెదక్ కు హన్మంత రావు సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి సిద్దిపేటకు భారతీ హోలీకెరీ. పెద్దపల్లి అదనపు బాధ్యతలు కరీంనగర్ కలెక్టర్ శశాంకకు. మంచిర్యాల అదనపు బాధ్యతలు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్టా పట్నాయక్ కు.
  • విశాఖ: ఇకపై విశాఖ కేంద్రంగా కొనసాగనున్న AP మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు విశాఖలో నేడు ప్రారంభం కానున్న AP మెట్రో రైలు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నగరంలోని LIC బిల్డింగ్ లోని 3వ అ౦తస్తులో కార్యాలయం మద్యహ్న౦ 12 గ౦టలకు మెట్రో కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మ౦త్రి బొత్స
  • ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై చివరి రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. నేడు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్రులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉత్సవాలకు చివరి రోజు కావడంతో రాజరాజేశ్వరి దేవి దర్శనార్ధం తరలి వస్తున్న భక్తులు . సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం . ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహంతో దుర్గమ్మ నదీ విహారం రద్దు . హంస వాహనంపైనే అమ్మవారి ఉత్సవ మూర్తులకు పూజాది కార్యక్రమాలను నిర్వహించనున్న అర్చకులు . పరిమిత‌సంఖ్యలోనే‌ విఐపి లకు అనుమతి. ఘాట్లలో భక్తులకు అనుమతి నిరాకరణ...ప్రకాశం బ్యారేజి నుంచి మాత్రమే వీక్షించేందుకు అనుమతి.
  • మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు కలకలం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 31 బస్ స్టాప్ దగ్గర్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ ముందు ఉన్న చెత్త డబ్బాలో పేలిన కెమికల్ డబ్బా. చెత్త డబ్బాలో చెత్త ఏరుకునే రాజు అనే వృద్ధుడి చేతికి తీవ్ర గాయాలు. 108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలీసులు.
  • విజయవాడ: కేంద్రహోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి . విజయదశమి పర్వదినాన ఏపీ బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి విముఖ్తి కలిగించాలని అమ్మవారిని కోరుకున్నాను. ఏపీ కార్యాలయం కేంద్రంగా బిజెపి పార్టీ పటిష్టతకు అందరం కలిసి పనిచేయాలి. గత 6 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి. దేశంలో అత్యధికంగా ఎమ్మెల్యేలు,ఎంపీ లు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. దేశంలో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాల ఎమ్మెల్యేలు,ఎంపీలు ఉన్న పార్టీ బిజెపి. రానున్న రోజుల్లో ఏపీ లో బిజెపి అధికారంలోకి వస్తుందన్న పూర్తివిశ్వాసం ఉంది. ఏపీ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం. మోడీ గారి నాయకత్వం లో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. విజయదశమి పర్వదినాన ప్రారభించిన ఏపీ బీజేపీ కార్యాలయం శుభాలకు,విజయాలకు నిలయంగా మారుతుందని ఆశిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు పాడిపంటలతో,సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దుర్గమ్మను కోరుకుంటున్నాను.

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

చైనాలో మరో మహమ్మారి పురుడుపోసుకున్న సంగతి తెలిసిందే. బ్రుసెల్లా అనే బ్యాక్టీరీయా ద్వారా వ్యాపించే ఆ వ్యాధి పేరు 'బ్రూసెల్లోసిస్'. తాజాగా ఈ వ్యాధి భారత్‌లో ప్రబలే..

Brucellosis Outbreak, బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

Brucellosis Outbreak: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ కూడా అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే దేశంలో 57 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకగా.. 91,149 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం చైనాలో మరో మహమ్మారి పురుడుపోసుకున్న సంగతి తెలిసిందే. బ్రుసెల్లా అనే బ్యాక్టీరీయా ద్వారా వ్యాపించే ఆ వ్యాధి పేరు ‘బ్రూసెల్లోసిస్’. తాజాగా ఈ వ్యాధి భారత్‌లో ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.  (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..)

ముఖ్యంగా ఈ వ్యాధి జంతువుల నుంచి వ్యాపిస్తుంది. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. పాడి పంటలకు నెలవైన భారత్‌లో ఆవులు, గేదెలు, పందుల ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా బ్రూసెల్లోసిస్ కేసులు వచ్చాయని.. అందుకే ముందుగా అప్రమత్తం కావడం మంచిదని తెలిపారు. ఈ వ్యాధి సోకినవారికి జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల నొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. (కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!)

కాగా, ఈ వ్యాధి మొదటిగా చైనాలోని ల్యాన్ఝౌ నగరంలో 3వేల మందికి సోకింది. ఓ ఫార్మాసిటికల్ కంపెనీ నుంచి ఈ బ్యాక్తీరియా బయటికి వచ్చింది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకునేందుకు వారాల నుంచి నెలల వరకు సమయం పెట్టవచ్చునని.. యాంటీ బయోటిక్స్ ద్వారా వ్యాధి నయం అవుతుందని వైద్యులు తెలిపారు. కాగా, విదేశాల నుంచి వచ్చేవారితో పాటు స్వదేశంలో ఉన్నవారికి కరోనా టెస్టులతో పాటు బ్రూసెల్లోసిస్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలని సూచిస్తున్నారు. (సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..)

Related Tags