AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్.. ఒక్క బంతికే దిమ్మతిరిగిందిగా..!

Gurnoor Brar Sledging Blair Tickner: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. చివరి వికెట్ కోసం పోరాడుతున్న బ్లెయిర్ టిక్నర్‌తో మాటల యుద్ధానికి దిగిన గుర్నూర్.. తర్వాతి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపించాడు. మరోవైపు టిక్నర్ 34 పరుగులతో నంబర్ 11 బ్యాటర్‌గా అరుదైన రికార్డును సమం చేశాడు.

Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్.. ఒక్క బంతికే దిమ్మతిరిగిందిగా..!
Gurnoor Brar Sledging Blair Tickner
Venkata Chari
|

Updated on: Nov 04, 2026 | 12:22 PM

Share

Gurnoor Brar Sledging Blair Tickner: భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar), న్యూజిలాండ్ బ్యాటర్ బ్లెయిర్ టిక్నర్ (Blair Tickner) మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. టిక్నర్‌ను స్లెడ్జింగ్ చేసిన గుర్నూర్.. మరుసటి బంతికే అతడిని ఔట్ చేసి తన బౌలింగ్‌తో సమాధానం చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గుర్నూర్ మూడు వికెట్లతో రాణించగా, న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 146 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను చివరి వికెట్‌కు జాకబ్ డఫీ, టిక్నర్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 39 పరుగులు జోడించారు. ముఖ్యంగా టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి భారత బౌలర్లకు సవాల్ విసిరాడు.

టిక్నర్‌కు గుర్నూర్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. గుర్నూర్ బ్రార్ వేసిన తొలి బంతిని టిక్నర్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో గుర్నూర్ అసహనం వ్యక్తం చేస్తూ.. పుల్ షాట్ ఎలా ఆడాలో చేతులతో సైగలు చేశాడు. దీనికి టిక్నర్ కూడా తగ్గలేదు. వికెట్లను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయాలంటూ బదులిచ్చాడు.

మరుసటి బంతికే పెవిలియన్‌కు!

టిక్నర్ వ్యాఖ్యలకు గుర్నూర్ తన బౌలింగ్‌తో సమాధానం చెప్పాడు. వెంటనే షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. ఈసారి టిక్నర్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బ్యాట్ అంచుకు తగిలి బంతి వెనక్కి వెళ్లింది. వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో 34 పరుగులు చేసిన టిక్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. గుర్నూర్‌కు ఇది మూడో వికెట్ కావడం విశేషం.

నంబర్ 11 బ్యాటర్‌గా టిక్నర్ అరుదైన రికార్డు

భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. దీంతో వన్డేల్లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల రికార్డును సమం చేశాడు.

వన్డేల్లో నంబర్ 11 బ్యాటర్లుగా అత్యధిక సిక్సర్లు:

4 – మహమ్మద్ అమీర్ (పాకిస్థాన్), ఇంగ్లండ్‌పై, 2016

4 – నసీమ్ షా (పాకిస్థాన్), న్యూజిలాండ్‌పై, 2025

4 – బ్లెయిర్ టిక్నర్ (న్యూజిలాండ్), భారత్‌పై, 2026

జోయెల్ గార్నర్ రికార్డుకు నాలుగు పరుగుల దూరంలో!

భారత్‌పై వన్డేల్లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం జోయెల్ గార్నర్ 37 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. టిక్నర్ 34 పరుగులు చేసి ఈ రికార్డుకు కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున చివరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి అతడు చేసిన పోరాటం జట్టుకు ఉపయోగపడింది.

ఒకవైపు గుర్నూర్ బ్రార్ తన స్లెడ్జింగ్‌కు వికెట్‌తో సమాధానం ఇవ్వగా.. మరోవైపు టిక్నర్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి నాలుగు సిక్సర్లతో అదరగొట్టడం ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సింగర్.. కారణమిదే
రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సింగర్.. కారణమిదే
Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్..
Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్..
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. తుఫాను సాయంపై కేంద్రానికి సీఎం లేఖ
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. తుఫాను సాయంపై కేంద్రానికి సీఎం లేఖ
ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?
ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?