కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

భారతీయ సంగీత ప్రపంచానికి ముద్దుబిడ్డ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాటలోని మాధుర్యం.. మనసు పెట్టి వినాలనిపిస్తుంది. ఆయన పాటే కాదు.. మాట కూడా ఒక లాలనలా.. చెవికింపుగా ఉంటుంది. ఉత్తర దక్షిణాది ప్రాంతాలన్నిటిలో బాలు అనే ముద్దుపేరుతో పిలిపించుకుని.. కమ్మని పాటకు కేరాఫ్ అనిపించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. (SPB Balu Passes Away) 24 వసంతాల నుంచి తనదైన తీరులో తర్ఫీదునిస్తూ ఎన్నో వేల ఆణిముత్యాల్ని అందించిన ఆ యశస్వి అందరినీ శోక సంద్రంలో ముంచి […]

  • Ravi Kiran
  • Publish Date - 7:32 am, Sat, 26 September 20

భారతీయ సంగీత ప్రపంచానికి ముద్దుబిడ్డ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాటలోని మాధుర్యం.. మనసు పెట్టి వినాలనిపిస్తుంది. ఆయన పాటే కాదు.. మాట కూడా ఒక లాలనలా.. చెవికింపుగా ఉంటుంది. ఉత్తర దక్షిణాది ప్రాంతాలన్నిటిలో బాలు అనే ముద్దుపేరుతో పిలిపించుకుని.. కమ్మని పాటకు కేరాఫ్ అనిపించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. (SPB Balu Passes Away)

24 వసంతాల నుంచి తనదైన తీరులో తర్ఫీదునిస్తూ ఎన్నో వేల ఆణిముత్యాల్ని అందించిన ఆ యశస్వి అందరినీ శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే గాన గంధర్వుడు ఎస్పీ బాలు చివరిసారిగా కరోనాపై ఓ పాట పాడారు. ఆయన పాట పాడటమే కాకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులందరికీ సూచనలు కూడా ఇచ్చారు. కరోనాపై ఎస్పీ బాలు మధురంగా పాడిన ఆ పాటను  మీరు కూడా చూడండి.