ప్లీజ్.. పేద దేశాలను పట్టించుకోండి.. వ్యాక్సిన్లు ఇవ్వాలని అగ్ర దేశాలకు who చీఫ్ వినతి
కోవిద్ పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కనీసం లక్షా 15 వేలమంది హెల్త్ కేర్ వర్కర్లు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు...
కోవిద్ పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కనీసం లక్షా 15 వేలమంది హెల్త్ కేర్ వర్కర్లు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని దేశాల్లో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ డ్రైవ్ పెంచాలని ఆయన సూచించారు. ఈ పాండమిక్ పై పోరాడుతూ లక్షల సంఖ్యలో హెల్త్ కేర్ వర్కర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని, రోగులకు వారు చేస్తున్న సేవలకు విలువ కట్టలేమని ఆయన చెప్పారు. దాదాపు 18 నెలలుగా వీరంతా జీవన్మరణాల మధ్య నిలిచారని ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. తమకు అందిన సమాచారం ప్రకారం ఇంతమంది వైద్య సిబ్బంది మృతి చెందినట్టు తెలిసిందని, కానీ వీరి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని ఆయన చెప్పారు. పేద దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్నాయని, ధనిక దేశాలు తమవద్ద అధికంగా ఉన్న టీకామందులను ఈ దేశాలకు అందజేయాలని ఆయన సూచించారు. 194 సభ్య దేశాల ఆరోగ్య శాఖ మంత్రులు హాజరైన వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచం ఇంకా ఇప్పటికీ ప్రమాదకర దశలోనే ఉందని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు తాము పరిస్థితిని పరిశీలిస్తున్నామని, తమ కొవాక్స్ కార్యక్రమం కింద అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపామని ఆయన వెల్లడించారు. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయినట్టు తెలిసిందని, ఆ దేశాలు ఇందుకు దారి తీసిన కారణాలను అధ్యయనం చేసి పరిస్థితిని సరిదిద్దాలని ఆయన అన్నారు.
కేవలం 10 దేశాల్లో మాత్రమే 75 శాతం పైగా వ్యాక్సినేషన్ జరిగినట్టు తెలిసిందన్నారు. ఇది ఇంకా చాలా పెరగాల్సి ఉందని ఆయన చెప్పారు. మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : ప్రెషర్ కుక్కర్ తో అవారిపడుతున్న యువకుడు వైరల్ అవుతున్న వీడియో : Desi Jugaad for steam video. Adilabad : కరోనా కాలంలో ఆకలి చావులు.. ఆకలికి తాళలేక వృద్దజంట తనువు చాలించింది..(వీడియో).