AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలో బట్టలు ఊడదీసుకున్న మహిళ… చివరికి ఏమైందంటే.. వీడియో వైరల్‌

ఓ మహిళ చేసిన వికృత చేష్టలకు విమానం వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. విమానంలో ఏకంగా బట్టలు విప్పేసుకుని వింతగా ప్రవర్తించింది. దీంతో ప్రయాణికులంతా వణికిపోయారు. అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీయడంతో విమానం వెనక్కి మళ్లించారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం హ్యూస్టన్‌లోని విలియమ్ పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ మహిళ బిగ్గరగా కేకలు వేసింది. హ్యూస్టన్ నుంచి

విమానంలో బట్టలు ఊడదీసుకున్న మహిళ... చివరికి ఏమైందంటే.. వీడియో వైరల్‌
Woman Passenger Naked
K Sammaiah
|

Updated on: Mar 07, 2025 | 3:29 PM

Share

ఓ మహిళ చేసిన వికృత చేష్టలకు విమానం వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. విమానంలో ఏకంగా బట్టలు విప్పేసుకుని వింతగా ప్రవర్తించింది. దీంతో ప్రయాణికులంతా వణికిపోయారు. అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీయడంతో విమానం వెనక్కి మళ్లించారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం హ్యూస్టన్‌లోని విలియమ్ పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ మహిళ బిగ్గరగా కేకలు వేసింది. హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ లో ఆమె ప్రవర్తనతో అంతా షాకయ్యారు. తన దుస్తులు తొలగించి, పెద్దగా అరుస్తూ అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. కాక్‌పిట్ డోర్ వద్దకువెళ్లి, దానిని బాదుతూ తనను దించేయాలని డిమాండ్ చేసింది. సుమారు 25 నిమిషాల పాటు ఆమె వింత ప్రవర్తన కొనసాగిందని ప్రయాణికుడు ఒకరు తెలిపారు. దాంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఒంటిపై దుప్పటికప్పి, ఫ్లైట్‌ దించేసి హ్యూస్టన్ పోలీసులకు అప్పగించారు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమెను మానసిక వైద్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో తాము తీవ్రంగా భయపడినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆమె ప్రవర్తనతో తాము తీవ్ర అసౌకర్యాన్ని గురయ్యామని భయపడిపోయామని అన్నారు. ఈ ఘటన కారణంగా 90 నిమిషాల ఆలస్యంతో విమానం గమ్యస్థానానికి బయల్దేరింది. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది.