AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న కెనడా ప్రధాని.. వీడియో వైరల్‌

ట్రంప్‌ కొరడా దెబ్బలు కొడుతుంటే, కన్నీళ్లు కారుతున్నాయి. దుఃఖం కట్టలు తెంచుకుంటుందోంది. ఇది ఏ కామన్‌మ్యాన్‌కో కాదు.. ఏకంగా కెనడా ప్రధాని కన్నీళ్లు కార్చాడు. కెనడా ప్రధాని ట్రూడో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గద్గద స్వరంతో మాట్లాడారు. ట్రంప్‌ టారిఫ్‌ నిర్ణయాల తర్వాత ట్రూడో మీడియా కెమెరాలకు ఇలా కన్నీళ్లతో కనిపించారు. అధికారంలో ఉన్న ప్రతిరోజు కెనడా ప్రజల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యమని ట్రూడో

ట్రంప్‌ దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న కెనడా ప్రధాని.. వీడియో వైరల్‌
Canada Pm
K Sammaiah
|

Updated on: Mar 07, 2025 | 2:21 PM

Share

ట్రంప్‌ కొరడా దెబ్బలు కొడుతుంటే, కన్నీళ్లు కారుతున్నాయి. దుఃఖం కట్టలు తెంచుకుంటుందోంది. ఇది ఏ కామన్‌మ్యాన్‌కో కాదు.. ఏకంగా కెనడా ప్రధాని కన్నీళ్లు కార్చాడు. కెనడా ప్రధాని ట్రూడో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గద్గద స్వరంతో మాట్లాడారు. ట్రంప్‌ టారిఫ్‌ నిర్ణయాల తర్వాత ట్రూడో మీడియా కెమెరాలకు ఇలా కన్నీళ్లతో కనిపించారు. అధికారంలో ఉన్న ప్రతిరోజు కెనడా ప్రజల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యమని ట్రూడో చెప్పారు. ప్రధానిగా చివరిరోజుల్లోనూ ఇదే తన ప్రాధాన్యం అన్నారు ట్రూడో. ఏకంగా ఒక దేశాధినేత ఇలా ఏడుస్తుండటం, షాకింగ్‌ గా ఉంది. ట్రూడో కన్నీళ్ల వీడియో వైరల్‌ అవుతోంది.

ప్రధానమంత్రి బాధ్యతల నుంచి జస్టిన్ ట్రూడో మరో రెండు రోజుల్లో దిగిపోనున్నారు. దేశ ప్రజల్లో ఆయన ప్రభుత్వానికి ఆదరణ పడిపోవడంతో ట్రూడో వైదులుగుతున్నారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి ఈ వారంలో రాజీనామా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా చివరిసారి కెనడా ప్రజలను ఉద్దేశించి ట్రూడో ప్రసంగించారు. కెనడా ప్రధానిగా నిరంతరం దేశ పౌరుల ప్రయోజనాల కోసమే పనిచేశానని, ఏనాడూ ప్రజలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా కెనడా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేశానని వివరించారు. ఈ అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా అంటూ ట్రూడో కన్నీళ్లు పెట్టుకున్నారు.

కెనడాపై అమెరికా టారిఫ్ లు విధించడాన్ని ప్రస్తావించారు. కెనడా, మెక్సికోలు సంపన్నంగా ఉంటేనే ‘అమెరికా ఫస్ట్‌’ సాధ్యమవుతుందనే విషయం ట్రంప్‌ గుర్తించడం లేదన్నారు ట్రూడో. మనలో ఏ ఒక్కరు ఓడిపోయి, మిగతా వారు గెలిచినా లాభం లేదన్నారు. అందరమూ విజేతలుగా నిలిస్తేనే సంతోషంగా ఉంటుందని అన్నారు. అమెరికా టారిఫ్ వార్ కు తాను దీటుగా జవాబిచ్చానని ట్రూడో చెప్పారు.