AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా పెరిగిన చికెన్‌ ధరలు.. KG రూ.9 వందలు! అయినా ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలిస్తే షాక్‌ అవుతారు!

రంజాన్‌ పండుగ సమయంలో పాకిస్తాన్‌లో చికెన్‌ ధరలు అనూహ్యంగా పెరిగి కిలోకు 800 పాకిస్తానీ రూపాయలకు చేరుకున్నాయి. డిమాండ్‌ పెరుగుదలకు తగ్గట్టు సరఫరా లేకపోవడం, ప్రభుత్వ నియంత్రణ విఫలం కావడం ఇందుకు కారణాలు. పేద ప్రజలు చికెన్‌ను కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. రంజాన్‌లో చికెన్‌ డిమాండ్‌ 40% పెరిగిందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం ధరలను నియంత్రించడానికి ప్రయత్నించినా ఫలితం లేదు.

భారీగా పెరిగిన చికెన్‌ ధరలు.. KG రూ.9 వందలు! అయినా ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలిస్తే షాక్‌ అవుతారు!
Chiken
SN Pasha
|

Updated on: Mar 07, 2025 | 11:14 AM

Share

ఏంటీ కేజీ చికెన్‌ రూ.800 అంటే భయపడ్డారా? ఒకవైపు బర్డ్‌ఫ్లూ భయంతో చాలా మంది చికెన్‌ తినడం మానేస్తే.. అంత రేటు ఎందుకు పెరిగిందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ధరలు పవిత్ర రంజాన్‌ మాసం కారణంగా పెరిగాయి. కార్తీక మాసంలో చాలా మంది హిందువులు నాన్‌ వెజ్‌ తినరు కాబట్టి, ఆ టైమ్‌లో చికెన్‌ ధరలు తగ్గుతాయి. కానీ, రంజాన్‌ మాసంలో ఉపవాసాలు ఉంటే ముస్లింలు సహరీ, ఇఫ్తార్‌ తర్వాత మంచి రుచికరమైన ఆహార పదార్థాలు తింటారు. ఎక్కువగా నాన్‌ వెజ్‌ తినేందుకు ఇష్టపడతారు. అందుకే చికెన్‌కు ఈ రేంజ్‌లో డిమాండ్‌ పెరిగింది. అయితే ఈ కేజీ రూ.800 ధరలు మనదగ్గర కాదులేండి. పాకిస్థాన్‌లో. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో, పాకిస్తాన్‌లో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కరాచీలో బ్రాయిలర్ చికెన్ ధర కిలోకు 120 నుండి 150 రూపాయలు పెరిగింది.

ప్రస్తుతం దీని ధర కిలోకు 720 నుండి 800 పాకిస్తానీ రూపాయల మధ్య ఉంది. అంతేకాకుండా, పవిత్ర మాసం ప్రారంభం ఫలితంగా, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో చికెన్ ధర దాదాపు 900 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అయితే ఇంత భారీగా చికెన్‌ ధరలు పెరుగుతున్నా, అక్కడి ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించడంలో విఫలం అవుతోంది. జనం కొనలేని విధంగా ధరలు పెరిగిపోతున్నందున, కరాచీ పరిపాలన అధికారిక చికెన్ ధరను కిలోకు 650 పాకిస్తానీ రూపాయలకు నిర్ణయించడానికి ప్రయత్నించింది. అయితే, ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోని స్థానిక దుకాణదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే చాలా ఎక్కువ ధరకు చికెన్ అమ్ముతున్నారు.

ముఖ్యంగా, పాకిస్తాన్‌లో చికెన్ ధర చాలా చోట్ల 50 శాతం వరకు పెరిగింది, దీని ఫలితంగా పవిత్ర మాసంలో చికెన్‌ను చాలా మంది జనం కొనలేకపోతున్నారు. రంజాన్ తో చికెన్ డిమాండ్ 40 శాతం పెరిగిందని, దీనివల్ల ధరలు పెరిగాయని రిటైల్ చికెన్ అమ్మకం దారులు చెబుతున్నారు. డిమాండ్‌ పెరిగే సప్లై కూడా పెరగాలి. అప్పుడే ధర నియంత్రణలో ఉంటుంది. కానీ, అక్కడ డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో దుకాణ దారులు ఇదే అదునుగా భావించి భారీగా దండుకుంటున్నారు. ఇక చేసేదేం లేక కొంతమంది అంత ధర పెట్టి చికెన్‌ కొంటుంటే.. మరికొంతమంది పాపం రంజాన్‌ ఉపవాసాల్లో ఉంటూ కూడా చికెన్‌ తినలేకపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.