AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్ వెజ్ పిజ్జా పంపుతారా ? రూ.కోటి పరిహారం చెల్లించండి, శాకాహార మహిళ డిమాండ్

తాను పూర్తి శాకాహారి (వెజ్) నని, కానీ తనకు నాన్ వెజ్ (మాంసాహార) పిజ్జా పంపారంటూ అమెరికన్ పిజ్జా ఔట్ లెట్ ను ఓ మహిళ కోర్టుకు లాగింది. ఈ మేరకు వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది.

నాన్ వెజ్ పిజ్జా పంపుతారా ? రూ.కోటి పరిహారం చెల్లించండి, శాకాహార మహిళ డిమాండ్
Pizza
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 13, 2021 | 7:24 PM

Share

తాను పూర్తి శాకాహారి (వెజ్) నని, కానీ తనకు నాన్ వెజ్ (మాంసాహార) పిజ్జా పంపారంటూ అమెరికన్ పిజ్జా ఔట్ లెట్ ను ఓ మహిళ కోర్టుకు లాగింది. ఈ మేరకు వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది. ఈ పిజ్జా రెస్టారెంట్ తనను ఛీట్ చేసిందని, ఇందుకు పరిహారంగా తనకు కోటి రూపాయల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఆమె కోరింది. దీపాలీ త్యాగి అనే ఈ మహిళ ఇలా కోర్టుకెక్కడం సంచలనం కలిగించింది. నా కుటుంబం పూర్తిగా శాకాహార కుటుంబం. మేము స్వచ్ఛమైన సంప్రదాయాలను, ఆచారాలను..మత విశ్వాసాలను పాటిస్తాం.. ప్రబోధాలు కూడా చేస్తుంటాం..అలాంటిది శాకాహార పిజ్జా పంపాలని కోరితే నాన్ వెజ్ పిజ్జా పంపారని ఈమె తన పిటిషన్ లో పేర్కొంది. 2019 మార్చి 21 న ఈమె యూపీ..ఘజియాబాద్ లోని  తన ఇంటి నుంచి వెజ్ పిజ్జాకు ఆర్డర్ ఇచ్చిందట .. ఆరోజు హొలీ పండుగ కావడంతో తన పిల్లలంతా ఆ పండుగ సంబరాలు జరుపుకుని ఆకలితో ఉన్నారని ఈమె తెలిపింది. అరగంట లోగా ఈ డిష్ పంపుతామని అమెరికన్ ఔట్ లెట్ హామీ ఇఛ్చినా ఆలస్యంగా డెలివరీ అయిందని,  కానీ తమనుతాము సర్ది చెప్పుకుని ..  దాని రుచి చూడగానే  అది నాన్ వెజ్ పిజ్జా అని తెలిసిపోయిందని దీపాలీ వెల్లడించింది. దాని లోపల పుట్టగొడుగుల బదులు మాంసం ముక్కలు కనిపించినట్టు ఆమె పేర్కొంది.

వెంటనే కస్టమర్ కేర్ సెంటర్ కు ఫోన్ చేశామని, కానీ అక్కడి నుంచి మొదట నిర్లక్ష్య సమాధానం వచ్చినట్టు ఆమె తెలిపింది. అదే ఏడాది మార్చి 26 న తనను ఈ ఔట్ లెట్ మేనేజర్ నని చెప్పుకున్న ఓ వ్యక్తి..మీ కుటుంబానికి ఉచితంగా వెజ్ పిజ్జా పంపుతామని చెప్పాడని, కానీ తనకు కలిగిన మానసిక క్షోభకు, తనను ఒక రకంగా మోసగించినందుకు తనకు కోటి రూపాయల పరిహారం కోరుతున్నానని దీపాలీ తన పిటిషన్ లో వెల్లడించింది. ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఈ మహిళ ఫిర్యాదుపై స్పందించాలని సంబంధిత పిజ్జా సంస్థను కోరింది. దీనిపై ఈ నెల 17 న విచారణ జరపాలని నిర్ణయించింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

Love Proposal: ఆమె మోకరిల్లింది.. అతను దాసోహమయ్యాడు.. కొన్ని తియ్యనైన కన్నీళ్లు.. వీడియో

KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై గళమెత్తిన కేటీఆర్, ఏపీ.. దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య ( వీడియో )

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి