AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleepy Don: ఓవల్ ఆఫీస్ ప్రెస్ మీట్ లో కూర్చుని నిద్రపోయిన ట్రంప్.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో వైట్ హౌస్ లోని ఆయన ఓవల్ ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. నిజానికి, ఓవల్ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ జరగుతుండగా.. పక్కనే కుర్చీలో కూర్చోని ట్రంప్ నిద్రపోతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు.

Sleepy Don: ఓవల్ ఆఫీస్  ప్రెస్ మీట్ లో కూర్చుని నిద్రపోయిన ట్రంప్..  వీడియో వైరల్
Donald Trump Sleepy Don
Balaraju Goud
|

Updated on: Nov 10, 2025 | 5:56 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో వైట్ హౌస్ లోని ఆయన ఓవల్ ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. నిజానికి, ఓవల్ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ జరగుతుండగా.. పక్కనే కుర్చీలో కూర్చోని ట్రంప్ నిద్రపోతున్నారు.

మీడియా కథనాల ప్రకారం, బరువు తగ్గించే మందుల ధరల తగ్గింపుకు సంబంధించి ఓవల్ కార్యాలయంలో మీడియా సమావేశం జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మీడియా కెమెరాలు ఉన్నాయన్న ధ్యాస మరిచిన ట్రంప్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

డొనాల్డ్ ట్రంప్ నిద్రపోతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియో ఆధారంగా వివిధ మీమ్స్ సృష్టించారు నెటిజన్లు. “స్లీపీ డాన్” కథనం ప్రచారంలోకి రావడం ప్రారంభమైంది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ ట్రంప్ అతని ఫోటోకు “డాడ్జీ డాన్ తిరిగి వచ్చాడు” అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, వీడియోలో, అతని కళ్ళు కొన్నిసార్లు తెరిచి ఉన్నట్లు కనిపించాయి. కొన్నిసార్లు మూసుకుపోయాయి. అతను వాటిని సరిగ్గా తెరవలేకపోయాడు. వీడియో వైరల్ అయిన తర్వాత, వైట్ హౌస్ దిద్దుబాటు చర్యల్లో నిమగ్నమై ఉంది. పనికిరాని కథనాన్ని ప్రచారం చేస్తున్నారని వైట్ హౌస్ కొట్టి పారేసింది.

వీడియో వైరల్ అయిన తరువాత, అమెరికా అధ్యక్షుడిని సోషల్ మీడియాలో ఎగతాళి చేయడం ప్రారంభించారు. జనం ట్రంప్‌ను “స్లీపీ డాన్” అని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. ఒకప్పుడు జో బైడెన్ ఆరోగ్యాన్ని ఎగతాళి చేసిన ట్రంప్, స్వయంగా తానే జోక్‌కు గురయ్యారు. ట్రంప్ ఒకప్పుడు మాజీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను “స్లీపీ జో” అని ఎగతాళి చేసేవారు. అయితే, ఈ సంఘటన తర్వాత, ట్రంప్ ఆరోగ్యం గురించి కూడా ప్రశ్నలు తలెత్తాయి.

వీడియో చూడండి.. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..