AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా ఘోరాలు.. పుతిన్ దాష్టీకాలంటూ వీడియో రిలీజ్ చేసిన ఆ దేశ రక్షణ శాఖ

Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో అమాయక పౌరులు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ అధికారిక గణాంకాల మేరకు ఫిబ్రవరి 24న..

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా ఘోరాలు.. పుతిన్ దాష్టీకాలంటూ వీడియో రిలీజ్ చేసిన ఆ దేశ రక్షణ శాఖ
Russia Ukraine War
Janardhan Veluru
|

Updated on: Mar 15, 2022 | 6:46 PM

Share

Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో అమాయక పౌరులు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ అధికారిక గణాంకాల మేరకు ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 90 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 100 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని వీడి ప్రాణాలు చేతబట్టుకుని ఇతర దేశాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) నివేదిక అంచనావేస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో వందలాది మంది మరణించగా.. వేలాది మంది తమ కుటుంబాలతో విడిపోయారని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో సానుకూల పరిష్కారం లభించాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.

యుద్ధోన్మాది రష్యా అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు ఓ వీడియోను రిలీజ్ చేసింది. రష్యా క్రిమినల్ దేశమంటూ ఈ వీడియోలో ఉక్రెయిన్ రక్షణ మంత్రి ధ్వజమెత్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పచ్చి అబద్ధాలకోరు.. కళంకితుడంటూ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా సేనలు తమ నేరాన్ని కాస్త ఆలస్యంగానైనా గుర్తిస్తాయని పేర్కొన్నారు. రికవరీ అయ్యేందుకు చాలా కాలం పట్టొచ్చని.. అయితే చివరకు తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ దేశంపై పుతిన్ దాష్టీకాలు అన్నిఇన్నీ కావంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఆరోపించారు.

Also Read..

Viral video: వేలెడంత లేడు కానీ వేదాంతాలు వల్లిస్తున్నాడుగా.. బ్రేకప్ గురించి ఈ బుడతడి మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..

Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!