Hijab Row Case: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు.. నేతల రియాక్షన్స్ ఇవీ..

హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్‌ తీర్పు ఇచ్చిన సంచలన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్‌ మంగళవారంనాడు(మంగళవారంనాడు) కీలక తీర్పు వెలువరించింది.

Hijab Row Case: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు.. నేతల రియాక్షన్స్ ఇవీ..
Hijab
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 15, 2022 | 2:29 PM

Hijab Row Case: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్‌ తీర్పు ఇచ్చిన సంచలన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్‌ మంగళవారంనాడు(మంగళవారంనాడు) కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ తప్పనిసరి కాదని..యూనిఫామ్‌ మాత్రమే ధరించాలని తేల్చి చెప్పింది. హిజాబ్‌పై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది.కొందరు ఈ తీర్పును స్వాగతిస్తుండగా.. మరికొందరు ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమంటూ పెదవి విరుస్తున్నారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  సుప్రీంకోర్టుకు వెళ్తామని అసదుద్దీన్‌ అంటుంటే..ఈ జడ్జిమెంట్‌ను బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై పలువురు రాజకీయ ప్రముఖుల రియాక్షన్స్ ఇలా ఉన్నాయి.

  1. కర్ణాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని మజ్లిస్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఒవైసీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరిస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. హిజాబ్‌ బ్యాన్‌పై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని పిటిషనర్లకు ఆయన సూచించారు.
  2. కర్ణాటక హైకోర్ట్‌ మంచి తీర్పిచ్చిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, విద్యాసంస్థలు నిర్ణయించిన డ్రెస్‌ కోడ్‌ పాటించాలన్నారు.
  3. ఇక 2018లోనూ కేరళలో ఇదే ఇష్యూ వచ్చిందన్నారు మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌. అప్పట్లో ముస్లిం న్యాయమూర్తే.. విద్యాసంస్థల్లో యూనిఫామ్‌ మాత్రమే ధరించాలని తీర్పిచ్చినట్టు వెల్లడించారు.
  4. హైకోర్ట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. ప్రతి ఒక్కరూ హైకోర్ట్‌ ఆదేశాలు పాటించాలన్నారు..శాంతిని కాపాడాలని..విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
  5. ఇక కోర్ట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నమన్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి. ప్రతి ఒక్కరూ హైకోర్ట్‌ ఆదేశాలను అంగీకరించడం ద్వారా శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. విద్యార్థులు అన్ని విషయాలు పక్కనబెట్టి అందరూ కలిసి చక్కగా చదువుకోవాలని సూచించారు.

Also Read..

Varsha Bollamma: కోర చూపులతో కవిస్తున్న వర్ష బొల్లమ్మ లేటెస్ట్ ఫోటోస్

Toyota Glanza: రూ. 6.39 లక్షల ప్రారంభ ధరతో టయోటా కొత్త కార్.. బ్యాలినోకి పోటీలో తగ్గేదే లే అంటున్న ఫీచర్లు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!