AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan-AAP: రాజస్థాన్‌నూ ‘ఆప్’ ఊడ్చేస్తుందా..? పంజాబ్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ ఇదే..

పంజాబ్‌లో ఘనవిజయం సాధించిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పోటీకి సిద్ధమైంది. రాష్ట్రంలో పార్టీ పునాదులను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Rajasthan-AAP: రాజస్థాన్‌నూ 'ఆప్' ఊడ్చేస్తుందా..? పంజాబ్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ ఇదే..
Aap In Rajasthan
Sanjay Kasula
|

Updated on: Mar 15, 2022 | 2:30 PM

Share

పంజాబ్‌లో ఆప్‌ సృష్టించింది మామూలు ప్రభంజనం కాదు. వేళ్లూనుకున్న పార్టీలను.. కూకిటి వేళ్లతో సహా పీకేసింది. ఉద్ధండులనుకున్న నేతల్ని ఉఫ్‌మని ఊదేసింది. 90పైగా స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఏళ్లుగా అధికారం పంచుకుంటున్న రెండు పార్టీలకు.. గట్టి షాక్‌ ఇచ్చింది. మొత్తంగా చీపురు కాదది… వాక్యూం క్లీనర్‌ అనిపించింది. ఆప్‌ చేతిలో కంగుతిన్న కాస్ట్‌లీ లీడర్లు .. దెబ్బకు బిత్తరపోయారు. అయితే.. ఇప్పుడు అదే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. పంజాబ్‌లో ఘనవిజయం సాధించిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పోటీకి సిద్ధమైంది. రాష్ట్రంలో పార్టీ పునాదులను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజస్థాన్‌లో కూడా చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు.

పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజస్థాన్ ప్రజలు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని తీసుకురాగలరని ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వసిస్తోంది. రాష్ట్రంలో పార్టీకి మరింత మంది సభ్యులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజస్థాన్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలా వద్దా అనేది సకాలంలో నిర్ణయించబడుతుంది. రాజస్థాన్ యూనిట్ ఇన్ చార్జిగా ఉన్న సంజయ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించి ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 140 స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఎక్కడా విజయం సాధించలేకపోయింది. అయితే పంజాబ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారంలోకి వస్తే రాష్ట్రం మంచి ప్రగతిని సాధించగలదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి: Wi-Fi Repeater: వైఫై రూటర్‌‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..

Target 2024: మళ్లీ అధికారమే టార్గెట్‌గా వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగనన్న ఏం చేయబోతున్నారో తెలుసా..