AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toyota Glanza: రూ. 6.39 లక్షల ప్రారంభ ధరతో టయోటా కొత్త కార్.. బ్యాలినోకి పోటీలో తగ్గేదే లే అంటున్న ఫీచర్లు..

New Toyota Glanza: దేశీయ మార్కెట్లోకి కొత్త టొయోటా గ్లాంజా లాంచ్ చేయబడింది. కొద్ది వారాల క్రితం మారుతి సుజుకి బాలెనో(Maruti Suzuki Baleno) మోడల్ విడుదల చేసిన క్రమంలోనే ఇది విపణిలోకి విడుదల అయ్యింది.

Toyota Glanza: రూ. 6.39 లక్షల ప్రారంభ ధరతో టయోటా కొత్త కార్.. బ్యాలినోకి పోటీలో తగ్గేదే లే అంటున్న ఫీచర్లు..
Toyota
Ayyappa Mamidi
|

Updated on: Mar 15, 2022 | 1:53 PM

Share

New Toyota Glanza: దేశీయ మార్కెట్లోకి కొత్త టొయోటా గ్లాంజా లాంచ్ చేయబడింది. కొద్ది వారాల క్రితం మారుతి సుజుకి బాలెనో(Maruti Suzuki Baleno) మోడల్ విడుదల చేసిన క్రమంలోనే ఇది విపణిలోకి విడుదల అయ్యింది. Glanza ప్రారంభ ధరలు బేస్ E- ట్రిమ్ కోసం రూ. 6.39 లక్షల నుంచి మొదలవుతాయి. టాప్-స్పెక్ S ఆటోమేటిక్ ట్రిమ్ (ఎక్స్-షోరూమ్, ఇండియా) కోసం రూ. 9.69 లక్షల వరకు పెరుగనున్నాయి. టయోటా తన డీలర్‌షిప్‌లు, వెబ్‌సైట్ ద్వారా కేవలం రూ.11,000 టోకెన్ చెల్లింపుతో కొత్త గ్లాంజా బుకింగ్‌లను గత వారం ప్రారంభించింది. ఈ మోడల్ లోని E- రూ.6.39 లక్షలు, S- రూ.7.29 లక్షలు, G- రూ.8.24 లక్షలు,V- రూ.9.19 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరలకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 90hp పవర్ తో మార్కెట్ లోకి వస్తుంది. బ్యాలినో కార్ లాగానే కార్ ముందుబాగం స్టైలిష్ లుక్ కలిగి ఉండనుంది. కానీ.. రెండు కంపెనీల మోడళ్లలో డిజైన్ వ్యత్యాసాన్ని చూపించేందుకు టయోటా తీవ్రంగా శ్రమించింది. బంపర్, ముందు గ్రిల్, హెడ్ లైట్, ఎల్ఈడీ లైట్స్ గ్రాఫిక్స్ డిజైన్ లో గ్లాంజా కొత్తదనాన్ని కలిగి ఉండనుంది. వేరువేరు మోడళ్లలో లభించే ఫీచర్లు మారనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ‘టయోటా ఐ-కనెక్ట్’ కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఈ నయా మోడళ్లలో వాహన ప్రియులను మెప్పించనున్నాయి. ఇందులో 5 స్పీడ్ ఆటో, మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరింట్లలో మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. హ్యాట్ బ్యాక్ విభాగంలో ఈ టయోటా కార్ మారుతీ సుజుకీ బ్యాలినో, హ్యుందాయ్ i20, టాటా అట్రోజ్, హోండా జాజ్, వోక్స్ వ్యాగెన్ పోలో మోడల్ కార్లతో పోటీపడనుంది.

ఇవీ చదవండి..

Kerala News: ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా అక్కడ బాయ్ కాట్.. అదేంటో మీరూ తెలుసుకోండి..

Royal Enfield Scram 411: మార్కెట్ లోకి కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ లాంఛ్.. బైకర్స్ మెచ్చే ధరలోనే..