Kerala News: ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా అక్కడ బాయ్ కాట్.. అదేంటో మీరూ తెలుసుకోండి..
Kerala News: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై(Russia Ukraine Crisis) ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కేరళలో బాయ్ కాట్ గురించి పూర్తి వివరాలు మీరూ తెలుసుకోండి.
Kerala News: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై(Russia Ukraine Crisis) ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఒక రెస్టారెంట్(Restaurant) వినూత్నంగా తన నిరనను తెలిపింది. దేశంలోని దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని ఒక రెస్టారెంట్ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే తమ రెస్టారెంట్ మెనూలో నుంచి పాపులర్ రష్యన్ సలాడ్ ను తొలగించింది. ఉక్రెయిన్ లో మనుషులపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. “ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా, మేము మా మెనూ నుంచి రష్యన్ సలాడ్ ని తొలగించాము” అంటూ ఇంగ్లీష్ లో ఒక బోర్డును ఏర్పాటు చేసింది.
కేరళ చాలా వరకు వామపక్ష భావజాలానికి కలిగి ఉండి సోవియట్ యూనియన్ కు దగ్గరగా ఉంటుంది. అక్కడ చదువుకోవటానికి వెళ్లిన భారత విద్యార్థులు తెలిపిన హృదయవిదారక యుద్ధ పరిస్థితులతో దీనిని బాయ్ కాట్ చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది మంది అమాయక పౌరులు సర్వస్వం కోల్పోయారు. ఇది కేవలం రష్యా, ఉక్రెయిన్ లనే కాక ప్రపంచంలోని అనేక దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉక్రెయిన్ దేశంలో అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు సహాయం కోసం అధికారులను అభ్యర్థిస్తున్నారు. రష్యా భీకర దాడుల వల్ల దాదాపు 700 మంది కేరళ విద్యార్థులు తూర్పు ఉక్రెయిన్‌లోని సుమీ అనే నగరంలో ఇటీవల చిక్కుకుపోయారు.
Kerala Restaurant takes Russian salad ? off their menu. They took meme very seriously.#RussianUkrainianWar #solidarityWithUkraine #UkraineUnderAttaсk pic.twitter.com/lTOvgxtx1j
— Maverick (@msp_singh10) March 6, 2022
ఇవీ చదవండి..
Royal Enfield Scram 411: మార్కెట్ లోకి కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ లాంఛ్.. బైకర్స్ మెచ్చే ధరలోనే..
Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఊగిసలాటల్లో కొనసాగుతున్న సూచీలు..