Viral video: వేలెడంత లేడు కానీ వేదాంతాలు వల్లిస్తున్నాడుగా.. బ్రేకప్ గురించి ఈ బుడతడి మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ప్రేమకు వయసు లేదు.. ఏ వయసులోనైనా రెండు మనసుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక చిన్న తనంలో పుట్టే ప్రేమ ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది.

Viral video: వేలెడంత లేడు కానీ వేదాంతాలు వల్లిస్తున్నాడుగా.. బ్రేకప్ గురించి ఈ బుడతడి మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..
Boy
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 15, 2022 | 6:23 PM

Viral video: ప్రేమకు వయసు లేదు.. ఏ వయసులోనైనా రెండు మనసుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక చిన్న తనంలో పుట్టే ప్రేమ ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది. స్కూల్ వయసులో పుట్టే ప్రేమ ఎంతో అందంగా ఉంటుంది. అయితే చిన్న వయసులో చిగురించిన ప్రేమలు చాలా వరకు ఆదిలోనే ముగిసిపోతుంటాయి.. ఎక్కడో వందలో మూడు మాత్రమే పెళ్ళిపీటల వరకు చేరుతూ ఉంటాయి. అలా చిన్న తనలోనే ప్రేమలో పడ్డ ఓ బుడతడు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. పీకల్లోతు ప్రేమలో మునిగి న వాళ్ళు కూడా ఇంతలా వేదాంతాలు వల్లించారేమో.. ప్రేమ గురించి తనకు జరిగిన మోసం గురించి ఆ చిన్నారి చెప్పిన మాటలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ప్రేమలో ఆ చిన్నారి కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో గాని ఎంతో జ్ఞానోదయం అయినట్టు మాట్లాడుతున్నాడు

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ చిన్నారిని యాంకర్ నీకు బ్రేకప్ అయ్యిందా అని ప్రశ్నించగా.. అవును అయ్యింది అని సమాధానం చెప్పాడు.. ఆమె నీ మనసును ఎన్ని ముక్కలు చేసింది అని ప్రశ్నించగా.. 5 ముక్కలు చేసింది అని ఫన్నీగా ఆన్సర్ చెప్పాడు. అలాగే మరో అమ్మాయిని ప్రేమిస్తావా అని అడిగితే.. మరో అమ్మాయిని నమ్మడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు.. అయితే ఆ యాంకర్ ఇదంతా జరుగుతూనే ఉంటుంది.. కాలం అంతా మార్చేస్తుంది. అని చెప్పగా.. ఆ బుడతడు.. జీవితాంతం సింగిల్ గా ఉండటమే మంచిది అని అంటాడు.. దాంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్న వయసులో ఆ చిన్నారి ఎంతో అనుభవం ఉన్న ప్రేమికుడిగా మాట్లాడటం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: ఈ చేపకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.? వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

Viral Video: పామును పడవగా మార్చుకున్న కప్ప, ఎలుకలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Viral Video: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? అరుదైన వీడియో..