AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ చేపకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.? వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

సముద్రపు లోతుల్లో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అవి అప్పుడప్పుడే నీటిపై కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మత్స్యకారులకు...

Viral Video: ఈ చేపకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.? వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!
Squid Fish
Ravi Kiran
|

Updated on: Mar 15, 2022 | 5:55 PM

Share

సముద్రపు లోతుల్లో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అవి అప్పుడప్పుడే నీటిపై కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మత్స్యకారులకు తారసపడుతుంటాయి. అలా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ స్క్విడ్ ఫిష్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సహజంగా సముద్రంలోని ప్రతీ జీవి తనను తాను రక్షించుకునేందుకు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయని అందరికీ తెలిసిందే. సరిగ్గా ఈ స్క్విడ్ చేప కూడా అంతే.. ఒకసారి వీడియో చూస్తే మీరూ అవునని ఒప్పుకుంటారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ బ్లాక్ స్క్విడ్(Squid) చేప చిన్న సైజ్ టబ్‌లో ఈదుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇక అందులో నుంచి ఓ వ్యక్తి దాన్ని చేతులతో మెల్లిగా నీటిలో నుంచి బయటికి తీస్తాడు. అంతే.! ఆ బ్లాక్ స్క్విడ్ చేప కాస్తా తెల్లగా మారిపోయింది. అది నిజంగా ఊసరవెల్లి మాదిరిగా తన రంగులు మార్చుకుంటోందని చెప్పే విధంగా ఆ వ్యక్తి ఆ చేపను మళ్లీ నీటిలోకి వదులుతాడు. క్షణాల్లో స్క్విడ్ ఫిష్ నల్లగా అయిపోయింది.

కాగా, ఈ వీడియోను ‘hersey.dahil16’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి లక్షల్లో వ్యూస్ రాగా.. 37 వేల మంది పైగా నెటిజన్లు లైక్ కొట్టారు. అలాగే ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..