Viral Video: పామును పడవగా మార్చుకున్న కప్ప, ఎలుకలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

ఇంటర్నెట్ ప్రపంచంలో, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వీడియో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: పామును పడవగా మార్చుకున్న కప్ప, ఎలుకలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Snake
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 15, 2022 | 5:35 PM

viral video: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వీడియో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇవి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. వీటిలో చాలా వరకు ప్రమాదకరమైన జంతువులకు సంబంధించినవే.. జంతువుల వీడియోల్లో అవి వేటాడటం మనం చూస్తూ ఉంటాం.. అయితే కొన్ని జంతువులు జాతివైరం మరిచి స్నేహంగా మెలగడం మనకు తెలిసిందే. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా పాములు ఎలుకలు కప్పలు కనిపిస్తే వదలవు.. వెంటనే వేటాడి మింగేస్తాయి. కానీ వీడియోలో మాత్రం అలా జరగలేదు. ఒకేసారి ఎలుకలు, కప్పు చిక్కినప్పటికీ పాము చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు

నెట్టింట్లో  కనిపించిన ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము ఒక కప్పను, రెండు ఎలుకలను తన వీపు పైన కుర్చోబెట్టుకొని సవారీ చేస్తూ కనిపించింది. ఒక ప్రాంతంలో భారీ వర్షం కారణంగా, ఒక పాము, ఒక కప్ప మరియు రెండు ఎలుకలు కంటైనర్‌లో చిక్కుకున్నాయి. పాము కావాలనుకుంటే ఆ కప్పను,ఎలుకలను ఆహారంగా మార్చుకోవచ్చు.. కానీ ఆ పాము కంటైనర్‌లో నిండిన నీటి నుండి కప్ప, ఎలుకలప్రాణాలు రక్షించింది. నీటిలో మునిగి పోకుండా కప్ప, ఎలుకలు పాము వీపుపైకి ఎక్కి కూర్చున్నాయి. వాటిని వీపు పై కుర్చోబెట్టుకొని ఆ పాము ఆ నీటిలో సవారీ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఈవీడియో పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ ఆశ్చర్యకరమైన వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by UNILAD (@unilad)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..