Viral Video: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? అరుదైన వీడియో..

ఓ వ్యక్తి ఏమాత్రం జంకు.. బొంకు లేకుండా ఏకంగా పాము (Snake)కు నీళ్లు తాగించాడండీ! ఏ స్ట్రాతోనో అని అనుకునేరు.. కానేకాదు! స్వయంగా చేతిలో నీళ్లు..

Viral Video: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? అరుదైన వీడియో..
Thirsty Snake
Follow us

|

Updated on: Mar 15, 2022 | 3:54 PM

Man Gives Water To Thirsty Snake Video Goes Viral: ఈ భూమిపై మానవజాతి మొత్తాన్ని భయపెట్టగలిగే జంతువుల్లో పాములు కూడా ఒకటి. అల్లంత దూరాన కనబడగానే పరుగులంకించుకునే భయస్తులు కూడా లేకపోలేదు ఈ జిందగీలో. సాధారణంగా విష సర్పాలు కాటేస్తే ప్రమాదమని, సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. ఐతే ఓ వ్యక్తి  ఏమాత్రం జంకు.. బొంకు లేకుండా ఏకంగా పాము (Snake)కు నీళ్లు తాగించాడండీ! ఏ స్ట్రాతోనో అని అనుకునేరు.. కానేకాదు! స్వయంగా చేతిలో నీళ్లు పోసుకుని పెంపుడు జంతువుకి తాగించినట్లు తాగించాడు. ఇక ఆ పాము హాయిగా అరచేతిలోని నీళ్లను ఆస్వాధిస్తూ తాగింది.. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట వైరలయ్యింది.

వేసవి కాలం దాదాపు వచ్చేసినట్టే. ఈ కాలంలో జంతువుల, పక్షలు నీటిని వెతుక్కుంటూ ఇలా జనారణ్యంలోకి అప్పుడప్పుడూ రావడం మామూలే. అదేవిధంగా దాహంతో ఉన్న పాము ఇంటి పెరట్లోకి రావడంతోక ఓ వ్యక్తి ధైర్యంగా నీటిని తాగించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇప్పటికే లక్షల్లో వీక్షణలు, లైకులు వచ్చాయి. ఇక ఈ వీడియోను చూపిన నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘పాము నీరు తాగడం ఫస్ట్‌ టైం చూస్తున్నానని ఒకరు, నిపుణుల పర్యవేక్షణలో పాముకు నీళ్లు తాగించినట్లు ఉంది. మామూలు వ్యక్తులకు అస్సలు సాధ్యం కాదని మరోకరు, ఎండాకాలంలో ఇంటి పరిసరాల్లో చిన్న కంటైనర్లలో నీటిని ఉంచితే పక్షులు తాగుతాయని ఇంకొకరు సరదాగా కామెంట్ చేశారు. గతంలో కూడా ఓ వ్యక్తి బకెట్‌తో కోబ్రాకు నీళ్లు తాగించిన వీడియో కూడా వైరల్‌ అయ్యింది. ఏదిఏమైనప్పటికీ మూగ జీవాలకు సాయం చేయడం మంచిదేగానీ వెనుకాముందు చూసుకోకుండా సాయంచేయాలనుకోవడం ప్రమాదం. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. అకారణంగా వాటిని పోగొట్టుకుని నమ్ముకున్నవారిని శోక సంద్రంలో ముంచడం మంచిదికాదుకదా! ఏమంటారు..నిజమేకదా!

Also Read:

CIMAP Jobs: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌లో ఉద్యోగాలు.. నో ఎగ్జాం!

Latest Articles