Viral Video: దేవుడా.. ముందు శత్రువు.. వెనక మృత్యువు.. పసిగట్టేలోపే ఊహించని ట్విస్ట్..

సోషల్ మీడియాలో పలు రకాల వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోలు అనేకం ఉన్నాయి.

Viral Video: దేవుడా.. ముందు శత్రువు.. వెనక మృత్యువు.. పసిగట్టేలోపే ఊహించని ట్విస్ట్..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 1:47 PM

సోషల్ మీడియాలో పలు రకాల వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోలు అనేకం ఉన్నాయి. జంతువులు వేటాడుతున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక చిరుత.. సింహం వేటకు బలయ్యే జింకలు.. మొసలి వేటలో ప్రాణం పోగొట్టుకునే గేదేలు.. పాము కాటుకు బలయ్యే చిన్న జంతువులు … ఇలా ఒక్కటేమిటీ.. బోలేడన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో చూస్తుంటాం.. కానీ ఎదురుగా శత్రువులు.. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే.. వెనక నుంచి వచ్చే మృత్యువును పసిగట్టేలోపు ప్రాణం పోయింది. ఒక ప్రాణి భూమిపైకి వెళ్తే శత్రువులతో పోరాటం.. గుంపుగా చేరి దాడి చేసేందుకు అదును చూస్తున్నాయి.. ధైర్యం చేసి గట్టునెక్కే లోపు.. నీటిలోని మొసలికి ఆహారంగా మారిపోయింది ఓ అడవి పంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయానికి వస్తే.. ఒక అడవి పంది దాహం తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లింది.. నీరు తాగి వెనకు తిరిగే లోపు.. ఎదురుగా హైనాల గుంపు వేటాడేందుకు కాచుకుని చూస్తున్నాయి. హైనాల నుంచి తప్పించుకోవడానికి కాసేపు అక్కడే నిలబడిపోయింది..ఆ తర్వాత హైనాల ముందుకు వెళ్లాడానికి ప్రయత్నించేలోపు వెనక నీటిలో ఉన్న మొసలి అమాంతం నోటపట్టేసింది..దీంతో ఆ మొసలికి ఆహారంగా మారిపోయింది ఆ అడవి పంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎదురుగా ఉన్న శత్రువుతో పోరాడితే గెలుపు.. ఓటమి తెలుస్తుంది.. కానీ వెనకాలే వచ్చే మృత్యువు నుంచి తప్పించుకోవడం కష్టం.. ఎదురుగా ఉండే శత్రువుల కంటే.. మన వెనకే ఉండే శత్రువులు చాలా ప్రమాదకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఎంటో చెప్పండి.

Also Read: Ajith: అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Radhe Shyam: వెజిటేరియన్ హోటల్‏కు వెళ్లి చికెన్ బిర్యానీ కావాలంటే ఎలా ?.. రాధేశ్యామ్ డైరెక్టర్ అసంతృప్తి..

Singer Chinmayi: ప్రధాని కావాలని కోరిన అభిమాని.. అదే వరస్ట్ ప్రపంచంలోనే టఫ్ అంటూ రిప్లై ఇచ్చిన సింగర్..

ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..