AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు క్యాన్సర్..? జింక కొమ్ముల రసంతో చికిత్స.. 

Proekt on Vladimir Putin: రష్యా - ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ కూడా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన వార్త

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు క్యాన్సర్..? జింక కొమ్ముల రసంతో చికిత్స.. 
Vladimir Putin
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2022 | 6:00 AM

Share

Proekt on Vladimir Putin: రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ కూడా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. గత కొన్నేళ్లలో పలుమార్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లింది క్యాన్సర్‌ చికిత్స కోసమేనంటూ రష్యాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ప్రొయెక్ట్ (Proekt) కథనాన్ని ప్రచురించింది. 2016 నుంచి పుతిన్ (Putin Health) థైరాయిడ్‌ క్యాన్సర్‌ లేదా పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నారని, దానికి చికిత్స కోసం క్యాన్సర్ నిపుణుడితో కలిసి డజన్ల కొద్దీ పర్యటనలు చేసినట్లు వెల్లడించింది. ఆయనకు చికిత్స అందించేందకు అధ్యక్ష కార్యాలయ సర్జన్‌ తరచూ నల్ల సముద్రంలోని పుతిన్ నివాసానికి వెళ్లేవారని పేర్కొంది. దీంతోపాటు జింక కొమ్ముల రసంతో స్నానం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సంచలన విషయాలను వెల్లడించింది.

2016 నుంచి 2019 వరకు క్యాన్సర్‌ సర్జన్‌తో పాటు చాలామంది వైద్యుల బృందం పుతిన్ నివాసానికి వెళ్లినట్లు కథనంలో పేర్కొంది. పుతిన్ అధికారిక సందర్శనల వివరాలను, ఆయన కనిపించకుండా పోయిన తేదీలను, హోటల్‌లో బస చేసిన వివరాలను ప్రొయెక్ట్ వెల్లడించింది. పుతిన్ రాజకీయాల్లో గత 23 ఏళ్లుగా ఉన్నా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి పట్ల ప్రజలకు ఎలాంటి విషయం తెలియదంటూ ప్రస్తావించింది. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు ప్రొయెక్ట్ ఎడిటర్ రోమన్ బడానిన్ పేర్కొన్నారు. కాగా.. ప్రొయెక్ట్‌ రష్యాకు చెందిన స్వతంత్ర మీడియా సంస్థ. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి వార్తలు ప్రచురించినందుకు రష్యన్ ప్రభుత్వం ప్రొయెక్ట్ సంస్థపై నిషేధం విధించింది.

కాగా.. 2016 నుంచి 2019 వరకు క్యాన్సర్‌ స్పెషలిస్టులు 166 రోజులపాటు సోచి నగరంలోని పుతిన్‌ నివాసంలో గడిపినట్లు రికార్డుల్లో ఉందని ప్రొయెక్ట్‌ తెలిపింది. వైద్యబృందంలోని కొద్దిమందికి అవార్డులు, పదోన్నతులు కూడా లభించినట్లు పేర్కొంది. కాగా.. ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ స్పందించారు. పుతిన్ ఆరోగ్యంపై ప్రొయెక్ట్ రాసిన కథనాన్ని ఆయన కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమంటూ పేర్కొన్నారు.

Also Read:

Pakistan Politics: పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఉన్నట్లా? లేనట్లా? పాకిస్తాన్ రాజకీయ చరిత్ర మొత్తం డిఫరెంటే..!

Russia Ukraine Crisis: యుద్ధం ముగింపు దశకు చేరుకుందా.. రష్యా ఏం ఆలోచిస్తుంది..