Brazil Rains: అకాల వర్షాలకు బ్రెజిల్ అతలాకుతలం.. 14 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటన
Brazil Rains: బ్రెజిల్ దేశంపై వరుణుడు ప్రతాపం చూపించాడు. అకాల వర్షంతో బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. ఆ దేశంలోని రియో డీ జెనీరో(Rio de Janeiro)లో కురిసిన ఆకస్మిక వర్షాల కారణంగా కొండ చరియలు..
Brazil Rains: బ్రెజిల్ దేశంపై వరుణుడు ప్రతాపం చూపించాడు. అకాల వర్షంతో బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. ఆ దేశంలోని రియో డీ జెనీరో(Rio de Janeiro)లో కురిసిన ఆకస్మిక వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి 14మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదల ధాటికి ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. తల్లితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. వరదల్లో మరో ఐదురుగు కొట్టుకుపోయారు. అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వారాంతంలో భారీ వర్షాల కారణంగా రియోరాష్ట్రం వెంబడి తీరప్రాంత పట్టణాలు, నగరాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్రంలోని బైక్సాడా ఫ్లూమినీస్ వంటి జనాభా కలిగిన ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయి.
రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 144 మందిని సురక్షితంగా తీసుకువచ్చినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహాయం చేసేందుకు సైనిక విమానాలను పంపినట్లు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తెలిపారు.
పారాటీలో ఒక రోజులో 322 మిమీ (12.68 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. ఇది ఆరు నెలల సగటు వర్షపాతం. ఇక్కడ వర్షాలకు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వీధులు బురదతో నిండుకుంది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పర్యాటక కేంద్రమైన పారాటీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సమీపంలోని తీరప్రాంత నగరమైన అంగ్రా డాస్ రెయిస్‌లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వసం అయ్యాయి. దీంతో అధికారులు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని హెచ్చరించారు.
మరోవైపు అంగ్రా డోస్ రీస్‌లో గత 48 గంటల్లో 655 మిమీ (26 అంగుళాలు) వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైందని వారు తెలిపారు. నగరంలో కనీసం ఆరుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
-O Governo Federal, por meio do @mdregional_br , segue apoiando o Rio de Janeiro, mais uma vez afetado por fortes chuvas nas últimas horas.
– Secretário nacional de Proteção e Defesa Civil, coronel Alexandre Lucas, está em deslocamento para as regiões mais atingidas.
— Jair M. Bolsonaro (@jairbolsonaro) April 2, 2022
Also Read: Telangana: ఏడాదికి ఒకసారి జాతర సమయంలోనే పాముల రూపంలో అమ్మవార్ల దర్శనం.. భారీగా భక్తులు