AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏడాదికి ఒకసారి జాతర సమయంలోనే పాముల రూపంలో అమ్మవార్ల దర్శనం.. భారీగా భక్తులు

Telangana: ఎక్కువుగా ఆలయంల్లో భగవంతుడు విగ్రహరూపంలో దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం విష సర్పాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి యేటా ఉగాది పర్వదినాన ఇక్కడి ఆలయంలో..

Telangana: ఏడాదికి ఒకసారి జాతర సమయంలోనే పాముల రూపంలో అమ్మవార్ల దర్శనం.. భారీగా భక్తులు
Kondalamma Jathara
Surya Kala
|

Updated on: Apr 03, 2022 | 12:21 PM

Share

Telangana: ఎక్కువుగా ఆలయంల్లో భగవంతుడు విగ్రహరూపంలో దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం విష సర్పాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి యేటా ఉగాది పర్వదినాన ఇక్కడి ఆలయంలో పాముల రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న కొండలమ్మ అమ్మవారి( Konadalamma Ammavaru) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో ఉంది ఈ కొండలమ్మ ఆలయం..జిల్లాలోని గార్ల మండలం పినిరెడ్డి గూడెం గ్రామ శివారులో కాకతీయుల కాలం నాటి అద్భుత కట్టడం శ్రీ కొండలమ్మ ఆలయం. ఈ ఏడాది అమ్మవారి జాతర ను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం కూడా వేయి స్తంభాల గుడిని పోలి ఉంటుంది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో ముగ్గురు అక్కాచెల్లెల్ల పేరుతో కొండలమ్మ చెరువు, గారమ్మ చెరువు, బాయమ్మ చెరువు అనే మూడు చెరువులతో పాటు పినిరెడ్డి గూడెం లో గుడిని నిర్మించారట..ఈ గుడిలోనే కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్టించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతియేటా ఇక్కడ జాతర ఘనంగా నిర్వహిస్తుంటారు.

జాతర ప్రారంభం రోజు ఎడ్ల బండ్ల ప్రబలతో గుడి చుట్టు ప్రదర్శనలు చేస్తారు. ఉగాది రోజున ముగ్గురు అమ్మవార్లు మూడు పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎప్పటిలానే ఈ సారి కూడా అమ్మవారు పాముల రూపంలో భక్తులకు దర్శనమించారు.. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తమకు మంచి జరగాలని ముడుపులు కడతారు. కోరికలు నెరవేరిన భక్తులు ముడుపులను విప్పి మొక్కులను చెల్లిస్తారు. ఈ జాతరలో మహబూబాబాద్, ఇల్లందు, ఖమ్మం, బయ్యారం, డోర్నకల్‌, కామేపల్లి, కారేపల్లి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి రూపంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వేళతాయో ఎవరికీ తెలియదంటున్నారు భక్తులు.

Also Read: Missing: ఒకే పాఠశాలలో నలుగురు విద్యార్థినులు అదృశ్యం.. పిఠాపురంలో సంచలనంగా మారిన ఘటన

Anand Mahindra: సంకల్పం, చాతుర్యం, సహనం ఉంటే విజయం మీ సొంతం.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో వైరల్