Viral Video: గాలిలో ఢీకొన్న రెండు ఆర్మీ విమానాలు.. ఐదుగురు సైనిక సిబ్బంది మృతి.. వీడియో వైరల్

సిరియాలోని అస్సాద్ ప్రభుత్వాన్ని పడగొట్టిన టర్కీలో పెద్ద ప్రమాదం జరిగింది. ఇస్పార్టాలోని నైరుతి ప్రావిన్స్‌లో శిక్షణా విమానంలో రెండు సైనిక హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5 మంది సైనిక సిబ్బంది మరణించారు

Viral Video: గాలిలో ఢీకొన్న రెండు ఆర్మీ విమానాలు.. ఐదుగురు సైనిక సిబ్బంది మృతి.. వీడియో వైరల్
Military Helicopter Crashed
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2024 | 5:45 PM

రెండు టర్కీ సైనిక హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఫలితంగా ఒక హెలికాప్టర్‌లోని ఐదుగురు సైనిక సిబ్బంది మరణించారు, మరొక హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండింగ్ చేయబడింది. ఈ ప్రమదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగాత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని గవర్నర్ అబ్దుల్లా ఇరిన్‌ చెప్పారంటూ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఎన్‌టివి తెలిపింది.

గవర్నర్ ప్రకారం నైరుతి ప్రావిన్స్ ఇస్పార్టాలో సాధారణ శిక్షణా విమానాల సమయంలో ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ఏవియేషన్ స్కూల్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బ్రిగేడియర్ జనరల్ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొనడానికి గల కారణాలేమిటన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై విచారణ ప్రారంభించినట్లు గవర్నర్ అబ్దుల్లా ఇరిన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది

టర్కీ రక్షణ మంత్రి కూడా ఈ సంఘటనను ధృవీకరించారు. ఈ ప్రమాదంలో 5 మంది సైనిక సిబ్బంది మరణించారని .. ఒకరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. నివేదికల ప్రకారం శిక్షణ సమయంలో టర్కీ ఆర్మీకి చెందిన రెండు UH-1 హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రష్యా మీడియా సంస్థ ఆర్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కొండ ప్రాంతంలో పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక దళం వాహనాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..