భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో అస్త్రం.. యుద్ధనౌక తుశీల్‌ను భారత్‌కు అప్పగించిన రష్యా.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

భారత నౌకాదళ అమ్ములపొదిలో మరొక శక్తివంతమైన యుద్ధ నౌక చేరింది. రష్యాలో నిర్మించిన శక్తివంతమైన యుద్ధనౌక INS తుషీల్‌ను భారత నౌకాదళంలోకి చేచేరింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ యుద్ధ నౌక తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్‌లో భాగంగా రష్యాలోని యంత్ర షిప్‌యార్డ్‌లో నిర్మించబడింది. ఈ యుద్ధనౌక రాకతో సముద్రంలో భారత్ బలం మరింత పెరగనుంది.

భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో అస్త్రం.. యుద్ధనౌక తుశీల్‌ను భారత్‌కు అప్పగించిన రష్యా.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
Ins Tushil Inducted Into Navy
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2024 | 8:03 PM

భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. రష్యాలో నిర్మించిన శక్తివంతమైన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తుశీల్‌ను సోమవారం భారత్‌కు అప్పగించారు. ఈ సందర్భంలో రష్యా, భారత్ ల మధ్య బందానికి ఉన్న ప్రత్యేకత కనిపించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి రష్యాకి చెందిన షిప్ నిర్మాణ అధికారులు.. స్వదేశీ క్షిపణులతో పాటు ఆధునిక సాంకేతికతతో కూడిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తుశీల్‌ను ప్రారంభించారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నేవీ చీఫ్‌తో కలిసి ఆదివారం అర్థరాత్రి మాస్కో చేరుకున్నారు. మంగళవారం రష్యాలో తన కౌంటర్ ఆండ్రీ బెలౌసోవ్‌తో కలిసి సాంకేతిక సహకారంపై ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్ 21వ సమావేశంలో పాల్గొంటారు. దీంతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలవనున్నారు.

ఇవి కూడా చదవండి

మరింత పెరగనున్న భారత నౌకాదళం బలం

ఈ యుద్ధనౌక చేరడంతో సముద్రంలో భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుంది. INS తుషీల్ బరువు 3900 టన్నులు. దీని ప్రత్యేకత విషయంలోకి వెళ్తే.. ఈ యుద్ధనౌక 125 మీటర్ల పొడవు, 3900 టన్నుల బరువు కలిగి ఉంది. ఈ నౌక శక్తివంతమైన దాడికి ప్రసిద్ధి చెందింది. INS తుశీల్ అనేది రష్యన్, భారతీయ అత్యాధునిక సాంకేతికత, యుద్ధనౌకల నిర్మాణాల గొప్ప కలయికగా రూపుదిద్దుకుంది.

INS తుశీల్ ఎంత శక్తివంతమైనది

సోమవారం భారత నౌకాదళానికి అప్పగించబడిన ఈ శక్తివంతమైన యుద్ధనౌకలో 18 మంది అధికారులు,180 మంది సైనికులు 30 రోజుల పాటు సముద్రంలో ఉండగలరు. అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు,24 మీడియం రేంజ్ క్షిపణులు ఇందులో మోహరించబడ్డాయి. ఇది తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్‌లో భాగం. దీనిని రష్యాలోని యంత్ర షిప్‌యార్డ్‌లో నిర్మించారు. ఈ నౌక గరిష్టంగా గంటకు 59 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.

రష్యాలో మూడు రోజుల పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిసెంబర్ 8 నుంచి 10 వరకు రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ రష్యాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సోమవారం ఐఎన్‌ఎస్ తుశీల్‌ను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. దీంతో పాటు మంగళవారం జరిగే ముఖ్యమైన సమావేశంలో కూడా పాల్గొననున్నారు. అంతకుముందు బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌లో రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా త్వరలో భారత్‌ను సందర్శించబోతున్నారని ఇప్పటికే ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ‘పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని.. తేదీలను త్వరలో ప్రకటిస్తామని’ తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..