Rajasthan: 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిన ఐదేళ్ళ బాలుడు.. రక్షించేందుకు SDRF, NDRF తీవ్ర యత్నం
ఆడుకుంటూ వెళ్లి ఓ ఐదేళ్ళ చిన్నారి బాలుడు బోరు బావిలో పడి మృత్యువుతో పోరాడుతున్న ఘటన రాజస్తాన్ లోని దౌసాలో చోటు చేసుకుంది. సుమారు 150 అడుగుల లోతున్న బోరు బావిలో బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న SDRF, NDRF బృందాలు.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరు బావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లా నుంచి ఓ విషాద కరమైన వార్త బయటకు వచ్చింది. నంగల్ రాజవతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళిఖండ్ గ్రామంలో 150 అడుగుల లోతున్న బోరుబావిలో ఐదేళ్ల చిన్నారి పడిపోయాడు. చిన్నారి బాలుడిని రక్షించేందుకు SDRF, NDRF బృందాలను కూడా రప్పించారు. పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోర్‌వెల్ లోపలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. సమాచారం మేరకు కాళిఖండ్ గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. చిన్నారి బోరుబావిలో పడ్డాడనే వార్త తెలియగానే గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో కుటుంబ సభ్యులు కేకలు వేయడం ప్రారంభించారు.
రెస్క్యూలో నిమగ్నమైన NDRF, SDRF బృందాలు
వెంటనే గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
150 అడుగుల లోతులో చిక్కున్న ఆర్యన్
ఈ చిన్నారి 150 అడుగుల లోతులో చిక్కుకున్నాడని గుర్తించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే రక్షించే పనులు మొదలు పెట్టారు. మరోవైపు నిరంతరం ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు. బోరుబావి దగ్గర సొరంగం నిర్మించేందుకు తవ్వకాలు జరుపుతున్నారు. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ సత్వరం పనులు చేపట్టింది. దీంతో పాటు నంగల్ రాజవతన్ పోలీస్, పాపాడ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సహాయ కార్యక్రమంలో దౌసా ఎమ్మెల్యే దిన్ దయాళ్ బైర్వా కూడా ఉన్నారు.
మూడేళ్ల క్రితం తవ్విన బోరుబావి
బోర్‌వెల్‌కు సమీపంలో టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. దీని కోసం అరడజను జేసీబీలు, అరడజనుకు పైగా ట్రాక్టర్ల సహాయం తీసుకుంటున్నారు. దాదాపు 15 అడుగుల మేర తవ్వారు. సహాయక పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఆర్యన్ పడిన బోరుబావిని మూడేళ్ల క్రితం తవ్వినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పట్టించుకోకుండా అలాగే వదిలేశారని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..