పెళ్లి రోజు బరువు తగ్గి అందంగా కనిపించేందుకు ‘గ్యాస్ట్రిక్ బెలూన్’ సర్జరీ చేయించుకున్న యువతి మృతి
సెప్టెంబర్ 7న లారా తన చిరకాల ప్రియుడు మాథ్యూస్‌తో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి నెలరోజులు ఉందనగా బరువు తగ్గాలని భావించింది. నాజుకుగా అందంగా బొమ్మలా కనిపించాలనుకున్న లారా సుమారు 8 కిలోల బరువు తగ్గాలనుకుంది. అయితే ఇందుకోసం ఆమె ఆపరేషన్ చేయించుకోవలనుకుంది. దీని కోసం ఆమె ఏప్రిల్ 26 న బ్రెజిల్‌లోని బెలో హారిజోంటేలోని ఒక క్లినిక్‌లో 'గ్యాస్ట్రిక్ బెలూన్' శస్త్రచికిత్స చేయించుకుంది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన, మధురమైన క్షణం. ఈ ప్రత్యేకమైన రోజున అందంగా కనిపించాలనేది ప్రతి ఒక్కరి కల. ఇప్పుడు బ్రెజిల్ కు చెందిన ఓ యువతి పెళ్లి రోజు గౌనులో బొమ్మలా కనిపించేందుకు బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అయితే బరువు తగ్గాలంటూ ఆమె చేసిన ప్రయత్నం.. పెళ్లి పల్లకిలో ఎక్కడానికి బదులు శవ పేటికలో చేరుకునే విధంగా చేసింది. మృతురాలిని లారా ఫెర్నాండెజ్ కోస్టా (31)గా గుర్తించారు. సెప్టెంబర్ 7న లారా తన చిరకాల ప్రియుడు మాథ్యూస్‌తో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి నెలరోజులు ఉందనగా బరువు తగ్గాలని భావించింది. నాజుకుగా అందంగా బొమ్మలా కనిపించాలనుకున్న లారా సుమారు 8 కిలోల బరువు తగ్గాలనుకుంది. అయితే ఇందుకోసం ఆమె ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది. దీని కోసం ఆమె ఏప్రిల్ 26 న బ్రెజిల్‌లోని బెలో హారిజోంటేలోని ఒక క్లినిక్‌లో ‘గ్యాస్ట్రిక్ బెలూన్’ శస్త్రచికిత్స చేయించుకుంది. అయితే సర్జరీ జరిగిన కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మే 1న యువతి ఆస్పత్రిలో చేరింది.
వైద్యులు లారా ఫెర్నాండెజ్ కోస్టాను పరీక్షించి కడుపులోని గ్యాస్ట్రిక్ బెలూన్‌ను బయటకు తీశారు. తరువాత ఆమె కడుపులో రంధ్రం ఏర్పడిందని.. దీని వల్ల కడుపు చుట్టూ ఇన్ఫెక్షన్ ఏర్పడిందని డాక్టర్ చెప్పారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స తీసుకుంటున్న యువతి మే 7న మృతి చెందినట్లు సమాచారం.
‘గ్యాస్ట్రిక్ బెలూన్’ సర్జరీ అంటే ఏమిటంటే
గ్యాస్ట్రిక్ బెలూన్ , ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్ ( IGB ) లేదా స్టొమక్ బెలూన్ అని కూడా పిలుస్తారు. బరువు తగ్గడానికి గాలితో కూడిన బెలూన్ కడుపులోకి ట్యూబ్ ద్వారా మౌఖికంగా ఉంచబడుతుంది. ఈ ప్రక్రియలో సెలైన్‌తో నిండిన సిలికాన్ బ్యాగ్ ఉదరం లోపల నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా ఎక్కువగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. అందువలన ఈ ‘గ్యాస్ట్రిక్ బెలూన్’ సర్జరీ చేయించుకుంటే వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుందని నమ్మకం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..