పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు..గ్రామం సమాధి, 100 మందికి పైగా మృతి

కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 100కు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పాపువా న్యూ గినియా అధికారులు ఆ సంఖ్యను అధికారికంగా ధృవీకరించలేదు. అయితే కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానిక గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిపై ప్రభుత్వానికి ఇంకా పూర్తి సమాచారం అందలేదని ప్రధాని జేమ్స్ మరాపే తెలిపారు.

పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు..గ్రామం సమాధి, 100 మందికి పైగా మృతి
Papua New Guinea Landslide
Follow us

|

Updated on: May 24, 2024 | 6:13 PM

పాపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడి భారీ విధ్వంసం దృశ్యం కనిపించింది. పాపువా న్యూ గినియాలోని మారుమూల పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా సమాధి చేసింది. 100 మందికి పైగా మరణించారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) ప్రకారం రాజధాని పోర్ట్ మోర్స్‌బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల (370 మైళ్ళు) దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కాక్లామ్ గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి.

కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 100కు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పాపువా న్యూ గినియా అధికారులు ఆ సంఖ్యను అధికారికంగా ధృవీకరించలేదు. అయితే కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానిక గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిపై ప్రభుత్వానికి ఇంకా పూర్తి సమాచారం అందలేదని ప్రధాని జేమ్స్ మరాపే తెలిపారు. అయితే కొండచరియలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు,

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాలను వెలికితీయడానికి, మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి PNG డిఫెన్స్ ఫోర్స్, విపత్తు అధికారులు, వర్క్స్ అండ్ హైవేస్ డిపార్ట్‌మెంట్ అధికారులను సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మరోవైపు చెట్లు, రాళ్లు శిధిలాల కింద ఉన్న మృతదేహాలను నివాసితులు బయటకు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి

పర్వతాలు విరిగి పడడంతో ఇళ్లు కూలిపోయాయని స్థానిక మహిళ ఎలిజబెత్ లారుమా తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆ సమయంలో ప్రజలు ఇళ్లలో నిద్రిస్తున్నారు. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా భూగర్భంలో సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో పోర్గెర-గ్రామం మధ్య రోడ్డు నిలిచిపోయింది. దీంతో ఇంధనం, సరుకుల సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది.

కౌక్లాం గ్రామంలో కొండచరియలు విధ్వంసం

చుట్టూ భారీ రాళ్లు, మొక్కలు, చెట్లు, కూలిపోయిన భవనాలతో పరిస్తితి దారుణంగా ఉందని గ్రామ నివాసి నింగ రోల్ చెబుతున్నారు. దీంతో మృత దేహాల ఆచూకీ దొరకడం కష్టమవుతోంది. పాపువా న్యూ గినియా 800 భాషలతో కూడిన ఓ దేశం. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 10 మిలియన్ల జనాభా ఉన్న పాపువా న్యూ గినియా ఆస్ట్రేలియా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దక్షిణ పసిఫిక్ దేశం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..