AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Mallya Cries : ఎక్కడుంది చీటింగ్.. ! ఎందుకు పదేపదే మోసగాడంటారు..? లండన్ నుంచి గలమెత్తిన విజయ్ మాల్కా

టీవీ చూస్తుంటే, అనేకమార్లు మోసం.. మోసగాడు అని నా పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు. అసలెక్కడుంది..

Vijay Mallya Cries : ఎక్కడుంది చీటింగ్.. ! ఎందుకు పదేపదే మోసగాడంటారు..? లండన్ నుంచి గలమెత్తిన విజయ్ మాల్కా
Vijay Mallya
Venkata Narayana
|

Updated on: Jun 04, 2021 | 10:35 AM

Share

Vijay Mallya argument : టీవీ చూస్తుంటే, అనేకమార్లు మోసం.. మోసగాడు అని నా పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు. అసలెక్కడుంది మోసం అంటూ గొంతెత్తారు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ బారన్ విజయ్ మాల్కా. ఈడీ చేత అటాచ్ చేయబడిన తన ఆస్తులు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్ రుణాలకంటే ఎక్కువే ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాదు, నూటికి నూరు శాతం రుణాలు తిరిగిచెల్లిస్తానని అనేక సార్లు చెప్పా.. ఇక ఎక్కడుంది మోసం, ఎవరూ దీనిని పరిగణలోకి తీసుకోరెందుకు.? అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు విజయ్ మాల్యా. కాగా, ఇండియాలో బ్యాంకులను 9 వేల కోట్ల రూపాయల మేర మోసగించి లండన్ చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి బ్యాంకులకు కోర్టు నుంచి ఇటీవల అనుమతి లభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 5,646 కోట్ల విలువైన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం ఇక వీటి విక్రయానికి పూనుకోనుంది. వీటిలో కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులు, సెక్యూరిటీలు ఉన్నాయి. వీటిని ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం గమనార్హం.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద విజయ్ మాల్కా ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోగా.. వీటి విక్రయాల ద్వారా తమ రుణాలను రాబట్తుకోవచ్చునని బ్యాంకుల కన్సార్టియం భావిస్తోంది. బెంగుళూరులో యూబీ సిటీ కమర్షియల్ టవర్, కింగ్ ఫిషర్ టవర్ వంటివి దాదాపు 564 కోట్ల ఖరీదు చేస్తాయి. ఇంకా యునైటెడ్ బ్రేవరీస్, యునైటెడ్ స్పిరిట్స్ లో సుమారు 5 వేలకోట్ల విలువ చేసే షేర్లు కూడా మాల్యాకు ఉన్నాయి. అయితే, మాల్యా నిర్దోషి అని లండన్ కోర్టు ప్రకటించినా, విచారణ జరగకపోయినా ఆయన ఆస్తులు ఆయనకు తిరిగి అప్పజెబుతామని బ్యాంకుల కన్సార్టియం బాండ్ రాసి ఇవ్వాలని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఆదేశించింది.

కాగా, మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అకౌంట్లలో తప్పిదాలు ఉన్నాయని ప్రాథమికంగా కోర్టు భావిస్తోంది. తమ క్లయింటు కేవలం పర్సనల్ గ్యారంటీ మాత్రమే ఇచ్చారని, ఇది మనీ లాండరింగ్ చట్ట పరిధిలోకి రాదని విజయ్ మాల్కా తరపు న్యాయవాదులు అంటున్నారు. అటు విజయ్ మాల్యా అప్పగింతపై లండన్ కోర్టులో ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి. తన ఆస్తులు అమ్మి బ్యాంకులు తన రుణాలను రాబట్టుకోవచ్చునని ఆయన కోర్టులో చెబుతున్నారు. అయితే ఇండియాకు ఆయన అప్పగింత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని విజయ్ మాల్కా లాయర్లు చెప్పుకొస్తున్నారు.

Read also : CCTV : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. రెండు కార్ల మధ్య కార్నర్ చేసి మహిళను అనేక సార్లు కత్తితో పొడిచిన పక్కింటి వ్యక్తి.!