AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCTV : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. రెండు కార్ల మధ్య కార్నర్ చేసి మహిళను అనేక సార్లు కత్తితో పొడిచిన పక్కింటి వ్యక్తి.!

28 ఏళ్ల మహిళ నడి రోడ్డు మీద అనేక మార్లు కత్తిపోట్లకు గురైంది...

CCTV : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం..  రెండు కార్ల మధ్య కార్నర్ చేసి మహిళను అనేక సార్లు కత్తితో పొడిచిన పక్కింటి వ్యక్తి.!
Woman Being Stabbed
Venkata Narayana
|

Updated on: Jun 04, 2021 | 8:37 AM

Share

Woman Being Stabbed Multiple Times : దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. 28 ఏళ్ల మహిళ నడి రోడ్డు మీద అనేక మార్లు కత్తిపోట్లకు గురైంది. ఈ దారుణ ఘటన సమీపంలో ఉన్న సిసిటివి కెమెరాల్లో నిక్షిప్తమైంది. కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళ ఇప్పుడు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పక్క ఇంట్లో ఉండే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో నిందితుడి మీద బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఆ కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డాడని మహిళ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇక, కత్తిపోట్లకు దిగిన వ్యక్తిని నరేష్ అలియాస్ రాజుగా గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. షాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ దాడి వెనుక ఉద్దేశ్యం ఇంకా నిర్ధారించబడలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెక్టార్ -11 పరిసరాల్లో జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటన రికార్డైన సిసిటివి ఫుటేజ్లో దాడి చేసిన వ్యక్తి.. ఆపి ఉంచిన రెండు కార్ల మధ్య మహిళను కార్నర్ చేసి, ఆమెను అనేకసార్లు పొడిచినట్టు కనిపిస్తోంది. అయితే, దాడి జరుగుతోన్న విషయాన్ని అటుగా వెళ్తోన్న ఒక వ్యక్తి చూసినప్పటికీ ఒక్క క్షణం ఆగి.. ఆపై దూరంగా నడుస్తూ వెళ్లిపోవడం విజువల్స్ లో కనిపించింది.

Read also : Neelima Kaushal: ‘బిగ్‌బాస్2’ విజేత కౌశల్ భార్య నీలిమ ఆవేదన.. యూకేలో పరిస్థితి దారుణంగా ఉందని సెల్ఫీ వీడియో.. !

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!