Joe lara: అభినవ టార్జాన్ ఇక లేడు ‘టార్జాన్..ది ఎపిక్ అడ్వెంచర్ ‘ మూవీ నటుడు జో లారా విమాన ప్రమాదంలో మృతి…

ఒకప్పుడు పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకర్షించిన టార్జాన్ చిత్రాల్లో నటించిన జో లారా విమాన ప్రమాదంలో మరణించాడు...

Joe lara: అభినవ టార్జాన్ ఇక లేడు 'టార్జాన్..ది  ఎపిక్ అడ్వెంచర్ ' మూవీ నటుడు జో లారా విమాన ప్రమాదంలో మృతి...
Joe Lara Dead
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 31, 2021 | 12:00 PM

ఒకప్పుడు పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకర్షించిన టార్జాన్ చిత్రాల్లో నటించిన జో లారా విమాన ప్రమాదంలో మరణించాడు. టార్జాన్ ది ఎపిక్ అడ్వెంచర్ వంటి మూవీల్లో నటించిన ఆయన ఈ నెల 29 న తన భార్యతో కలిసి జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా నషవిల్లె లోని పామ్ బీచ్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాద సమాచారం తెలిసినవెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి రాత్రంతా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే విమానంలోని వారంతా మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి కారణం తెలియలేదు. ఈ ప్లేన్ లో జో లారా అతని భార్య గువెన్ లారా..మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్టి తెలిసింది. జో లారా వయస్సు 58 ఏళ్ళు.. 1996-2000 సంవత్సరాల మధ్య పలు టార్జాన్ మూవీల్లో లారా నటించచాడు . ఇంకా స్టీల్ ఫ్రాంటియర్, సన్ సెట్ హీట్, గన్ స్మోక్, ది లాస్ట్ ఎపాచీ, బేవాచ్, ట్రోపికల్ హీట్, వంటి చిత్రాల్లో నటించి ఎంతో పాపులర్ అయ్యాడు. లారా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు.

ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నటుని మృతికి హాలీవుడ్ తీవ్ర సంతాపం ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: West Bengal: ముదురుతున్న పశ్చిమ్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ వివాదం.. రిలీవ్ చేయలేమని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ

Ap Telangana Borders: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ.. పోలీసుల‌కు కొత్త త‌లనొప్పి