AUSTRALIA PROBLEM: కంగారూలను కంగారెత్తిస్తున్న కొత్త సమస్య.. సాయం కోసం భారత్‌వైపు చూస్తున్న ఆస్ట్రేలియా

కంగారూలను కొత్త సమస్య కంగారెత్తిస్తోంది. అస్ట్రేలియాలో కొత్తగా మొదలైన ఓ సమస్య ఆ దేశ ప్రభుత్వాన్ని భారత్ సాయం కోసం చూసేలా చేస్తోంది. అయితే.. మన దేశంలో నిషేధంలో వున్న ఓ రసాయనాన్ని...

AUSTRALIA PROBLEM: కంగారూలను కంగారెత్తిస్తున్న కొత్త సమస్య.. సాయం కోసం భారత్‌వైపు చూస్తున్న ఆస్ట్రేలియా
Rats
Follow us

|

Updated on: May 31, 2021 | 1:08 PM

AUSTRALIA PROBLEM SEEKING INDIA HELP: కంగారూలను కొత్త సమస్య కంగారెత్తిస్తోంది. అస్ట్రేలియాలో కొత్తగా మొదలైన ఓ సమస్య ఆ దేశ ప్రభుత్వాన్ని భారత్ సాయం కోసం చూసేలా చేస్తోంది. అయితే.. మన దేశంలో నిషేధంలో వున్న ఓ రసాయనాన్ని ఆ దేశం దిగుమతి చేయాలంటోంది. ఈ అంశంపై భారత ప్రభుత్వంతో ఆస్ట్రేలియా అధికారులు తీవ్ర స్థాయిలో చర్చలు మొదలు పెట్టారు. నేడో, రేపో ఆస్ట్రేలియాకు సాయమందించే విషయంలో మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.

యావత్ ప్రపంచం కరోనా వైరస్‌తో అతలాకుతమవుతోంది. ఆస్ట్రేలియాకు మాత్రం అనుకోని కొత్త సమస్య ఎదురైంది. తొలుత ఇదేమంత పెద్ద సమస్య కాదని కంగారూలు భావించారు. కానీ రోజురోజుకూ ఈ సమస్య పెరిగిపోతోంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎలుకలు పెద్ద సమస్యగా పరిణమించాయి. పెద్ద గుంపుగా తయారై పాడిపంటలను నాశనం చేసేస్తున్నాయి. న్యూ సౌత్ వేల్స్ సహా పలు ఆస్ట్రేలియా రాష్ట్రాలలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిన ఎలుకల సంతతి పంటలను నాశనం చేయడంతోపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన ఎలుకలు పంట పొలాలను పాడు చేయడమే కాకుండా నివాస స్థలాలు, రెస్టారెంట్లు, హోటళ్ళలో చేరి సర్వనాశనం చేసేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలు పెద్ద సంఖ్యలో పరుగులు పెడుతుండడం చూస్తున్న అధికారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఎలుకల సంతతి ఇలాగే పెరిగిపోతే.. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలే ప్రమాదం వుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆందోళన పడుతోంది. అయితే.. ఈ ఎలుకల సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా మనదేశ సాయం కోరింది. మన దేశంలో గతంలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసిన బ్రోమాడియోలోన్ అనే విష రసాయనాన్ని దిగుమతి చేయాలని ఆస్ట్రేలియా కోరుతోంది. అయితే.. ఈ రసాయనం ఉత్పత్తిపై ప్రస్తుతం మన దేశంలో నిషేధం వుంది. దాంతో ఆస్ట్రేలియా అభ్యర్థనపై ఎలా స్పందించాలా అని మోదీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

మన దేశం నుంచి 5 వేల లీటర్ల బ్రోమాడియోలోన్ కొనుగోలు చేసేందుకు ఆస్ట్రేలియా ఆర్డర్ పెట్టింది. దీనికి సంబంధించి భారత అధికారులతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆస్ట్రేలియా జాతీయ ప్రభుత్వం ఎలుకల బాధను అధిగమించేందుకు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి 3600 కోట్ల రూపాయలను కేలాయించింది. ఈ మొత్తం నుంచి బ్రోమాడియోలోన్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే.. ఆస్ట్రేలియా పరిస్థితిని అర్థం చేసుకున్న మన దేశ ప్రభుత్వం బ్రోమాడియోలోన్ సరఫరాపై సానుకూల నిర్ణయం తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విష రసాయనం రాగానే ఎలుకలను చంపేందుకు ఆస్ట్రేలియా కార్యాచరణ రెడీ చేసుకుంది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!