AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఎలుకల దాడి

ఎక్కడ చూసినా ఎలుకలే! గుంపులు గుంపులుగా.. వేలాదిగా! వీటిని ఏం చేయాలో తెలియక ఆస్ట్రేలియా ప్రభుత్వం సతమతమవుతోంది..

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఎలుకల దాడి
New South Wales State
Balu
| Edited By: Phani CH|

Updated on: May 31, 2021 | 4:31 PM

Share

ఎక్కడ చూసినా ఎలుకలే! గుంపులు గుంపులుగా.. వేలాదిగా! వీటిని ఏం చేయాలో తెలియక ఆస్ట్రేలియా ప్రభుత్వం సతమతమవుతోంది.. అసలు కరోనాతో అల్లాడిపోతున్న తమకు ఈ కొత్త సమస్య ఏమిట్రా బాబూ.. అంటూ తలలు బాదుకుంటోంది.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కరోనా కాదు పెద్ద సమస్య.. ఎలుకలే అతి పెద్ద సమస్య.. గుంపులు గుంపులుగా పొలాలపై దాడి చేస్తూ చేతికొచ్చిన పంటను సర్వ నాశనం చేస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంతగా ఎలుకల సంఖ్య పెరగడానికి కారణమేమిటో తెలియదు కానీ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో, రెస్టారెంట్లలో, హోటళ్లలో, పార్కుల్లో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ చికాకు, చీదరం పుట్టిస్తున్నాయి. వీటితో న్యూ సౌత్‌వేల్స్‌ ప్రజలు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలుకలకు అడ్డుకట్ట వేయడానికి న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం 3,600 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. ఎలుకలను పట్టేందుకు ప్రత్యేకంగా మనుషులను నియమించింది. అయిదు దశాబ్దాలుగా అక్కడ కరువు ఉండింది.. అయితే కొన్నాళ్లుగా వర్షాలు కురుస్తున్నాయి. కరువు తీరింది. పంటలు కూడా సమృద్ధిగా పండుతున్నాయి.. పంటలతో పాటు ఎలుకలూ పెరిగాయి..

ఎలుకలతో చాలా ప్రమాదం.. పంటలు నాశనం చేయడంతో పాటు వాటి వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి.. భయంకరమైన ప్లేగు వ్యాధి వాటివల్లే సంభవిస్తుంది.. ఒకవేళ ప్లేగు కనక మళ్లీ పుట్టుకొస్తే పెను ప్రమాదం తప్పదు. జనం పిట్టల్లా రాలిపోవడం ఖాయం.. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయంలో భారత్‌ను సాయం అడిగింది. ఇక్కడ ఎలుకల సంహారానికి బ్రోమాడియోలోన్‌ అనే విష పదార్థాన్ని వాడేవారు.. ఆ విషంతో ఎలుకల సంఖ్య చాలా తగ్గింది. కాకపోతే ఈ బ్రోమాడియోలోన్‌ వాడకం వల్ల ఇతర సమస్యలు వచ్చి పడ్డాయి.. అందుకే భారత్‌లో దీన్ని నిషేధించారు.

ఇప్పుడు భాతర్‌ నుంచి దాదాపు అయివేల లీటర్ల బ్రోమాడియోలోన్‌ను కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి భారత్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి దాదాపు 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్‌ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. భారత్‌ నుంచి బ్రోమాడియోలోన్‌ విష పదార్థం అందగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి తీసుకుని, ఎలుకల పని పట్టేందుకు సిద్ధమవుతోంది న్యూ సౌత్‌వేల్స్‌ ప్రభుత్వం..

మరిన్ని ఇక్కడ చూడండి: ACB Catches GHMC DE: ఏసీబీ సోదాల్లో బయటపడ్డ బంగారం, నగదు.. అధికారుల అదుపులో లంచగొండి జీహెచ్ఎంసీ అధికారిణి..!

Juhi Chawla: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లక్కిన నటి జుహీ చావ్లా..