ACB Catches GHMC DE: ఏసీబీ సోదాల్లో బయటపడ్డ బంగారం, నగదు.. అధికారుల అదుపులో లంచగొండి జీహెచ్ఎంసీ అధికారిణి..!
కాప్రా మున్సిపాలిటీ కార్యాలయం డీఈగా పనిచేస్తున్న మహాలక్ష్మీ లంచం తీసుకుంటూ.. అవినీతి అధికారులకు పట్టుబడింది. డీఈ నివాసంలో బంగారం, నగదు అక్రమంగా గుర్తించామని ఏసీబీ అధికారులు.
ACB Catches GHMC DE: ఎలాంటి పరిస్థితులైన అధికారులు తమ తీరు మార్చుకోలేకపోతున్నారు. డబ్బుల కోసం అమాయకులను పట్టి పీడిస్తున్నారు. తాజాగా ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కుకుంది. కాప్రా మున్సిపాలిటీ కార్యాలయం డీఈగా పనిచేస్తున్న మహాలక్ష్మీ లంచం తీసుకుంటూ.. అవినీతి అధికారులకు పట్టుబడింది. జీహెచ్ఎంసీ స్వీపర్ సాలెమ్మ భర్త మృతిచెందగా ఆమెభర్త ఉద్యోగం సాలెమ్మకు వచ్చింది. దీంతో ఆమె డీఈ మహాలక్ష్మిని కలిసారు.
అయితే ఇరవై వేలు లంచంగా ఇస్తేనే ఉద్యోగంలో పని చేయాలని లేదంటే ఉద్యోగం నుండి తీసి వేస్తామని డీఈ మహాలక్ష్మి బెదిరించింది. లంచం కావాలని డిమాండ్ చేసింది. దీంతో సాలెమ్మ కొడుకు శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మల్లాపూర్ శివ పార్వతి హోటల్ లో డీఈ మహాలక్ష్మి 20 వేల రూపాయలు లంచంగా తీసుకున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మల్లాపూర్ వార్డు కార్యాలయంలో అధికారులు ఆమెను విచారించారు. కాప్రా మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు డీఈ నివాసంలో బంగారం, నగదు అక్రమంగా గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు పూర్తి అయిన తర్వాత మహాలక్ష్మిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. Read Also… MLA Seethakka: సీతారాం తండాలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య.. నిందితులను కఠినంగా శిక్షించాలిః ఎమ్మెల్యే సీతక్క డిమాండ్