Imran Khan: ఆఫ్గనిస్తాన్ వ్యవహారాన్ని అమెరికా గందరగోళపరిచింది.. నోరు విప్పిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాన్ని అమెరికా పూర్తిగా గందరగోళ పరిచిందని, జటిలం చేసేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆఫ్ఘన్ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని, తాలిబన్లతో బాటు అన్ని వర్గాలతో కూడిన రాజకీయ పరిష్కారమే ఉత్తమమని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాన్ని అమెరికా పూర్తిగా గందరగోళ పరిచిందని, జటిలం చేసేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆఫ్ఘన్ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని, తాలిబన్లతో బాటు అన్ని వర్గాలతో కూడిన రాజకీయ పరిష్కారమే ఉత్తమమని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మొదట 2001 లో అమెరికా ఈ దేశాన్ని దాదాపు హస్తగతం చేసుకున్నదని, ఆ తరువాత తాలిబన్లతో పొలిటికల్ సొల్యూషన్ అంటూ మొత్తం పరిస్థితిని క్లిష్టతరం చేసిందని ఆయన చెప్పారు. అసలు తన ఉద్దేశం ప్రకారం.. ఆఫ్ఘన్ వ్యవహారాన్ని ఆ దేశం (అమెరికా) భ్రష్టు పట్టించిందని ఆయన విమర్శించారు. ఆఫ్ఘన్ చరిత్ర గురించి తెలిసిన తనను అమెరికా వ్యతిరేకి అని, ‘తాలిబన్ ఖాన్’ అని పిలుస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆఫ్ఘానిస్తాన్ లో లక్షా 50 వేల వరకు నేటో దళాలు ఉన్నప్పుడే అమెరికా దీనికి రాజకీయ పరిష్కారం కనుగొనవలసి ఉండిందన్నారు. ఆ తరువాత ఆ దేశం తన బలగాలను 10 వేలకు తగ్గించి వేసిందని, దాంతో తాలిబన్లు ఇక తమదే విజయమని భావించడానికి ఆస్కారం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఇప్పుడు వారిని రాజీకి రమ్మనడం చాలా కష్టమన్నారు.
2001 లో ఆల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ను అప్పగించడానికి నాటి ఆఫ్ఘన్ ప్రభుత్వం నిరాకరించడంతో..అమెరికా ఆ దేశంపై దాడికి దిగిందని, తాలిబన్ల ప్రభుత్వాన్ని పడగొట్టిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నిజానికి ఆఫ్ఘన్ లో యూఎస్ వార్ అనంతరం తమ దేశానికి చెందిన 70 వేల మందిమరణించారని, 2001 సెప్టెంబరు 11 న న్యూయార్క్ లో జరిగిన సంఘటనలకు తమ దేశానికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఇంతమంది పాకిస్తానీయులు మృతి చెందారని ఆయన అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics 2021 Live: బాక్సింగ్‌లో సత్తా చాటిన పూజారాణి.. ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగు
‘నా ఫోన్ కూడా హ్యాక్ అయింది.. పరిస్థితి చాలా సీరియస్’.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన