AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021 Highlights: టోక్యో ఒలంపిక్స్‌లో పతకంపై ఆశలు కలిగిస్తున్న ఆర్చర్ దీపికా… క్వార్టర్స్‌‌లోకి ఎంట్రీ

Tokyo Olympics 2021 Highlights: టోక్యో ఒలంపిక్స్ లో భారీ అంచనాలతో అడుగు పెట్టింది పీవీ సింధు. పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది.. ఈ నేపథ్యంలో పీవీ సింధు మరో విజయాన్ని..

Tokyo Olympics 2021 Highlights: టోక్యో ఒలంపిక్స్‌లో పతకంపై ఆశలు కలిగిస్తున్న ఆర్చర్ దీపికా... క్వార్టర్స్‌‌లోకి ఎంట్రీ
Deepika Kumari
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 28, 2021 | 6:07 PM

Share

Tokyo Olympics 2021 Highlights: టోక్యో ఒలంపిక్స్ లో భారీ అంచనాలతో అడుగు పెట్టింది పీవీ సింధు. పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది.. ఈ నేపథ్యంలో పీవీ సింధు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు జరిగిన గ్రూప్ జే మ్యాచ్ లో సింధు హాంకాంగ్ ప్లేయర్ ను ఓడించింది. హాంకాంగ్ ప్లేయర్ చియాంగ్‌పై సింధు వరుసగా రెండు సెట్లలో 21-9, 21-16తో గెలుపు అందుకుంది. దీంతో గ్రూప్‌ జె నుంచి మొదటి ప్లేస్ లో నిలిచి ప్రీ క్వార్ట్రర్స్ లోకి అడుగు పెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో 16 వ రౌండ్‌లో సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jul 2021 05:50 PM (IST)

    ప్రీక్వార్టర్స్‌ లో అడుగు పెట్టిన దీపికా కుమారి

    భారతీయ స్టార్ ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలంపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో దీపికా అమెరికా ఆర్చర్ జెన్నీఫర్ ఫెర్నాండేజ్ పై 6-4 తేడాతో విజయం సొంతం చేసుకుంది. దీపికా ఫెర్నాండేజ్ లు ఐదు సెట్లవరకూ హోరాహోరీగా తలపడ్డారు. దీపికా 2, 3, 5 సెట్లను గెలిచింది. జెన్నిఫర్ 1, 4 సెట్లు గెలిచింది. దీంతో నాలుగు సెట్ల అనంతరం ఇద్దరూ నాలుగేసి పాయింట్లను సాధించి సమానంగా నిలిచారు. దీంతో విజేత నిర్ణయం కోసం జరిగిన సెట్ లో దీపిక 26 స్కోర్ చేసింది. జెన్నిఫర్ పై విజయం 6-4 తేడాతో విజయం సొంతం చేసుకుని క్వార్టర్ లో అడుగు పెట్టింది.

  • 28 Jul 2021 03:34 PM (IST)

    ఆర్చరీ ఉమెన్స్‌ సింగిల్స్‌లో దీపికా కుమారి గెలుపు

    ఒలంపిక్స్ 6 వరోజు భారత్ మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈరోజు ఒక్క పతకం కూడా ఆదుకోకపోయినా పీవీ సింధు, పూజారాణిలతో పాటు దీపికా కుమారి కూడా గెలుపొంది.. నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టారు. ఆర్చరీ ఉమెన్స్‌ సింగిల్స్‌లో దీపికా కుమారి ఫస్ట్ రౌండ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది. భూటాన్‌కి చెందిన కర్మాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడు సెట్లలో 6-0తో దీపికా కుమారి గెలుపొందింది. దీంతో దీపికా రౌండ్ 16కి అర్హత సాధించింది.

  • 28 Jul 2021 03:17 PM (IST)

    బాక్సింగ్ లో సత్తా చాటిన పూజారాణి..

    టోక్యో ఒలంపిక్స్ భారత బాక్సర్ పూజా రాణి విజయాన్ని సొంతం చేసుకుంది. 16 వ రౌండ్‌లో అల్జీరియాకు చెందిన ఇచ్రాక్ చైబ్‌ తో తలపడిన పూజారాణి 5-0 తో గెలుపొందింది. పూజా తన పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్​ చూపెట్టింది. తిరుగులేని పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రత్యర్థిని చిత్తు చేసి  మహిళల మిడిల్ (69-75 కిలోలు) విభాగంలో క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టింది. మొదటి నుంచి పూజారాణి పై భారీ అంచనాలు ఉన్నాయి.

  • 28 Jul 2021 02:00 PM (IST)

    ఆర్చరీ మెన్స్‌ సింగిల్స్‌లో ఓడిన ప్రవీణ్‌ జాదవ్‌

    ఆర్చరీ మెన్స్‌ సింగిల్స్‌లో ప్రవీణ్‌ జాదవ్‌ పోరాటం ముగిసింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో అమెరికాకు చెందిన ఆర్చరీ చేతిలో భారీ తేడాతో ప్రవీణ్ ఓడిపోయాడు. ప్రపంచ నెంబర్‌వన్‌ ఎలిసన్‌ బ్రాడీ చేతిలో 6-0 తేడాతో పరాజయం పాలయ్యాడు.

  • 28 Jul 2021 01:24 PM (IST)

    పతకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్‌లో జపాన్.. 39 వ స్థానంలో భారత్

    కరోనా మహమ్మారి కారణంగా ఏడాది తర్వాత టోక్యో వేదికగా ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. కోవిడ్ భయాన్ని పక్కకి పెట్టి.. 32వ ఒలంపిక్స్ ఎడిషన్ ను జపాన్ ఆతిధ్యం ఇచ్చింది. ఈ ఏడాది ఒలంపిక్స్ లో 205 దేశాల నుంచి దాదాపు 11 వేలమంది అథ్లెట్లు పాల్గొన్నారు. 17 రోజుల పాటు జరిగే జపాన్ రాజధాని టోక్యో ఒలంపిక్స్ లో ఒలంపిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 339 ఈవెంట్లలో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలు ఆగస్టు 8 న ఒలింపిక్స్‌ ముగుస్తాయి. చరిత్రలో రెండవసారి జపాన్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తోంది. 300కు పైగా పతకాలను క్రీడాకారులు గెల్చుకుంటారు. ఇక టోక్యో ఒలంపిక్స్ పతకాల పూర్తి పట్టికలో ఆతిధ్య దేశం జపాన్ దూసుకపోతోంది. 10 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు (18) సాధించి అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్య పతకాలు (25) సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా..మూడోస్థానంలో చైనా (21) ఉంది. భారత్ కేవలం 1 రజత పతకం సాధించి..39వ స్థానంలో కొనసాగుతోంది.

  • 28 Jul 2021 11:55 AM (IST)

    ఓడిపోతున్నాననే ఉక్రోషంతో ప్రత్యర్థి చెవికొరికిన బాక్సర్

    విజయం సొంతం చేసుకోవాలనే ఏ క్రీడాకారుడైనా బరిలోకి దిగుతాడు.. అయితే అనుకోని సందర్భంలో ఓటమి పాలైదిశగా అడుగులు వేస్తుంటే.. కొంతమంది హుందా ఆ ఓటమిని అంగీకరిస్తారు.. మరికొందరు ఓటమిని భారాన్ని తట్టుకోలేక ఆ సమయంలో తమకు తోచిన విధంగా ప్రవర్తిస్తాడు ఈ విషయాన్నీ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ రుజువు చేశాడు.. బాక్సింగ్ రింగ్ లో తాను ఓడిపోతున్నాడని ఉక్రోషంతో ప్రత్యర్థి హొలీ ఫీల్డ్ చెవి కొరికేశాడు.. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన 1997 లో జరిగింది.. కానీ ఇప్పటికీ ఆ న్యూస్ హల్ చల్ చేస్తూనే ఉంది. కాగా తాజాగా టోక్యో ఒలంపిక్స్ లోనూ మైక్ టైసన్ వారసుడు వెలుగులోకి వచ్చాడు. హెవీ వెయిట్‌ విభాగంలో న్యూజిలాండ్ క్రీడాకారుడు డేవిడ్‌ నికా మొరాకో బాక్సర్‌ యూనెస్‌ బల్లా తో తలపడ్డాడు.. అయితే బల్లా ..నికా చేవిని కొరికేసాడు.. ఈ విషయం రిఫరీ దృష్టిలో పడలేదు.. కానీ టివీల్లో మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే నికా చేతిలో బల్లా ఓటమిపాలయ్యారు.. ఇదే విషయంపై నికా స్పందిస్తూ.. ప్రత్యర్థి చేసిన పనిని లైట్ తీసుకున్నాడు.. ఆటలో ఇటువంటివి సహజమేనని.. బల్లా మానసిక పరిస్థితిని తాను అర్ధం చేసుకోగలను అంటూ బల్లా ని సమర్ధించాడు. టగాడిగా బల్లాను గౌరవిస్తున్నాను అన్నాడు.. అయితే బల్లా చేసిన పనిపై సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

  • 28 Jul 2021 11:29 AM (IST)

    వరసగా మూడోసారి ఓడిన భారత్ మహిళా హాకీ జట్టు.. దాదాపు క్వార్టర్ ఫైనల్ ఆశలు గల్లంతు

    టోక్యో ఒలంపిక్స్ లో పూల్ ఏ నుంచి బరిలోకి దిగిన భారత మహిళా హాకీ జట్టు మరోసారి ఓటమి పాలైంది. గ్రేట్ బ్రిటన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి నుంచి బ్రిటన్ క్రీడాకారులు ఆటపై ఆధిపత్యం ప్రదర్శించారు. 4-1 తేడాతో భారత్ మహిళా హాకీ జట్టు ఓటమిపాలింది. వరసగా మూడోసారి ఓడిపోవడంతో దాదాపు క్వార్టర్ ఫైనల్ కు చేరే దారులు మూసుకుపోయాయి. మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి.. ఇతర జట్ల గెలుపు ఓటమిలను లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • 28 Jul 2021 11:23 AM (IST)

    పతకంపై ఆశలు రేపిన తరుణ్ దీప్ రాయ్.. ఆర్చరీ మెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 లో ఓటమి

    టోక్యో ఒలంపిక్స్ లో పతాకం పై ఆశలు రేపిన భారత ఆర్చరీ తరుణ్ దీప్ రాయ్ పోరాటం ముగిసింది. ఆర్చరీ మెన్స్ సింగిల్స్ లో రౌండ్ ఆఫ్ 32 లో గెలిచి పతకంపై ఆశలు రేపిన తరుణ్.. రౌండ్ ఆఫ్ 16 లో చివరివరకూ పోరాడి పరాజయం పాలయ్యాడు. షూట్ ఆఫ్ ద్వారా విన్నర్ ను తేల్చే ఈ రౌండ్ లో ఇజ్రాయిల్ ఆర్చర్ ఇతాయ్ షానీ చేతిలో 5-6 తేడాతో ఓడిపోయాడు. ఐదు సెట్ల వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగింది భారత్, ఇజ్రాయిల్ క్రీడాకారుల మధ్య పోటీ.. ఇద్దరూ చెరో ఐదు పాయింట్లతో సమానంగా నిలిచారు. మొదటి ఐదో సెట్లలో ఇతాయ్ షానీ విజయం సొంతం చేసుకోగా.. రెండు నాలుగు సెట్లను తరుణ్ దీప్ గెలుచుకున్నాడు. మూడో సెట్లో ఇద్దరికీ చెరొక పాయింట్ రావడంతో.. విజేతను నిర్ణయించే షూట్ ఆఫ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇందులో తరుణ్ దీప్ 9 స్కోర్ చేస్తే. ఇతాయ్ మాత్రం 10కి పది పాయింట్లు స్కోర్ చేసి. గెలిచాడు. దీంతో ఆర్చరీ మెన్స్ సింగిల్స్ లో తరుణ్ దీప్ పోరాటం ముగిసింది.

Published On - Jul 28,2021 5:59 PM