Tokyo Olympics 2020: బాక్సింగ్‌లో మేరికోమ్ ఓటమి.. స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాష్ నిష్క్రమణ..

Ravi Kiran

|

Updated on: Jul 29, 2021 | 5:57 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈరోజు ఆశించినదగిన ఫలితాలు సాధించినా.. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం ఆశలు ఆవిరి అయ్యాయి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది.

Tokyo Olympics 2020: బాక్సింగ్‌లో మేరికోమ్ ఓటమి.. స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాష్ నిష్క్రమణ..
Mary Kom

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈరోజు ఆశించినదగిన ఫలితాలు సాధించినా.. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం ఆశలు ఆవిరి అయ్యాయి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. మేరీకోమ్‌కు ఇదే చివరి ఒలింపిక్స్.. ఎలాగైనా స్వర్ణ పతకాన్ని సాధించాలని అనుకుంది. కానీ ఈ ఐదుసార్ల ఆసియా విజేతకు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల బాక్సింగ్ 51 కిలోల విభాగంలో కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. నువ్వానేనా అంటూ సాగిన ఈ పోరులో తొలి రౌండ్‌లో వలెన్షియా ఆధిక్యం సాధించింది. 4-1తో ముందంజ వేసింది. ఇక ఆ తర్వాత రెండు రౌండ్లలో మేరీకోమ్ విజ‌ృంభించింది. పంచ్‌లు విసిరింది. పిడిగుద్దుల వర్షం కురిపించింది. దీనితో 3-2 తేడాతో రెండు రౌండ్లూ గెలిచింది. అయితే మేరీకోమ్ కంటే వలెన్షియా స్వల్పంగా ఆధిక్యంలో ఉండటంతో రిఫరీ ఆమెను విన్నర్‌గా ధృవీకరించారు. దీనితో బాక్సింగ్ రింగ్‌లోనే కన్నీరు కార్చింది. ఇక ఈ పోరులో మేరీ మొత్తంగా 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో పరాజయం పాలైంది. ఇదే ఆమె కెరీర్‌కు ముగింపు అనుకోవచ్చు! ఇదిలా ఉంటే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో వలెన్షియాను మేరీకోమ్ ఓడించగా.. ఇప్పుడు ఆమె ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లో మేరీకోమ్‌ను ఓడించింది. కొలంబియా తరపున ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని సాధించిన మహిళా బాక్సర్‌గా వలెన్షియా నిలిచింది.

సాజన్ ప్రకాష్ నిష్క్రమణ..

100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్‌ రెండవ హీట్ పూర్తయింది, ఇందులో భారతదేశానికి చెందిన సాజన్ ప్రకాష్ పాల్గొన్నాడు. అతడు 53.45 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఘనాకు చెందిన అబేకు జాక్సన్ 53.39 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అన్ని హీట్స్ పూర్తయిన తర్వాత, సాజన్ 46వ స్థానంలో నిలవడంతో.. తర్వాత రౌండ్‌కు అర్హత కోల్పోయాడు. అమెరికన్ ఈతగాడు కాలేబ్ డ్రెసెల్ హీట్స్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. 50.39 సెకన్లతో ఒలింపిక్ రికార్డును సమం చేశాడు. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన సింగపూర్‌కు చెందిన జోసెఫ్ స్కూలింగ్ చేసిన రికార్డును బద్దలుకొట్టాడు.

బ్యాడ్మింటన్ – పీవీ సింధు విజయం..

పీవీ సింధు తన మొదటి నాకౌట్ రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడి గెలిచింది. తొలి గేమ్‌లో 21-15, రెండవ గేమ్‌లో 21-13 ఆధిక్యం సాధించింది. వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

ఈ రోజు భారత్ ప్రయాణం ముగిసింది…

ఈ రోజు టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం ఈవెంట్స్ ముగిశాయి. గత కొన్ని రోజుల కంటే ఈ రోజు ఫలితాలు భారతదేశానికి మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రోజు భారతదేశం ఏ పతక పోటీలోనూ భాగం కాలేదు. కానీ చాలా మ్యాచ్‌లలో భారత ఆటగాళ్ళు విజయాలతో తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు. బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్, హాకీలలో భారతదేశానికి మంచి ఫలితాలు వచ్చాయి.

బుధవారం మిశ్రమ ఫలితాలు..

బుధవారం భారతదేశానికి మిశ్రమ ఫలితాలు అందాయి. మహిళల బాక్సింగ్ జట్టు మరోసారి నిరాశ పరచగా, దీపికా కుమారి, పీవీ సింధు తమ ఈవెంట్లతో ముందుకు అడుగులు వేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jul 2021 04:11 PM (IST)

    మేరీ కోమ్ ఓటమి

    తన చివరి ఒలింపిక్స్ ఆడుతున్న మేరీ కోమ్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 3 వ రౌండ్ మ్యాచ్‌లో, మేరీ కోమ్ కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్సియా చేతిలో 3-2 తేడాతో ఓడిపోయింది. దీంతో 51 కేజీల విభాగంలో భారత్‌ పతకాల వేట ముగిసింది.

  • 29 Jul 2021 11:05 AM (IST)

    మనుబాకర్‌ శుభారంభం

    మహిళల 25 మీ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ మను బాకర్‌ శుభారంభం చేసింది. ప్రెసిషన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 292 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇదే విభాగం నుంచి పోటీ పడిన మరో భారత షూటర్‌ రాహీ సర్నోబాత్‌ నిరాశ పరిచింది. 287 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది.

  • 29 Jul 2021 10:03 AM (IST)

    బాక్సింగ్ – క్వార్టర్ ఫైనల్ చేరిన సతీష్ కుమార్

    సతీష్ కుమార్ జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌ను 4-1 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పతకానికి ఒక అడుగు దూరంలో నిలిచాడు.

  • 29 Jul 2021 10:01 AM (IST)

    ఆర్చరీ – అతానుదాస్ విజయం

    అతానుదాస్ మ్యాచ్‌లో అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు. కొరియాకు చెందిన ఓహ్ జిన్హెక్ పై విజయం సాధించి, క్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హోరాహోరీగా తలపడిన ఇద్దరూ సమంగా నిలిచారు. షూట్ అవుట్ లో ఫలితం తేలింది. ఓహ్ జిన్హెక్ షూట్ అవుట్‌లో తొమ్మిది స్కోరు సాధించగా. అతానుదాస్ 10 స్కోర్ సాధించడంతో విజయం సాధించాడు.

  • 29 Jul 2021 07:43 AM (IST)

    హాకీ: అర్జెంటీనాపై విజయం

    భారత పురుషుల హాకీ టీం విజయం సాధించింది. చివరి నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేసి భారత విజయాన్ని ఖరారు చేశాడు. ఒలింపిక్ బంగారు పతక విజేత అర్జెంటీనాను 3-1 తేడాతో ఓడించింది.

  • 29 Jul 2021 07:11 AM (IST)

    బ్యాడ్మింటన్ – పీవీ సింధు విజయం

    పీవీ సింధు తన మొదటి నాకౌట్ రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడి గెలిచింది. తొలి గేమ్‌లో 21-15, రెండవ గేమ్‌లో 21-13 ఆధిక్యం సాధించింది. వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

  • 29 Jul 2021 07:04 AM (IST)

    బ్యాడ్మింటన్ – పీవీ సింధు మ్యాచ్ ప్రారంభం..

    పీవీ సింధు తన మొదటి నాకౌట్ రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడుతుంది. తొలి గేమ్‌లో సింధు 4-1 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన షట్లర్ టోర్నమెంట్‌ నుంచి ఔట్ కానున్నారు.

  • 29 Jul 2021 05:55 AM (IST)

    బుధవారం మిశ్రమ ఫలితాలు..

    బుధవారం భారతదేశానికి మిశ్రమ ఫలితాలు అందాయి. మహిళల బాక్సింగ్ జట్టు మరోసారి నిరాశ పరచగా, దీపికా కుమారి, పీవీ సింధు తమ ఈవెంట్లతో ముందుకు అడుగులు వేశారు.

  • 29 Jul 2021 05:54 AM (IST)

    నేడు భారతదేశానికి ముఖ్యమైన రోజు..

    ఈ రోజు ఒలింపిక్స్‌లో భారతదేశానికి చాలా ముఖ్యమైన రోజు. దేశం రెండవ పతకం కోసం ఎదురుచూస్తోంది. మను బాకర్ పతకం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే నేడు పీవీ సింధు, మేరీ కోమ్ బరిలోకి దిగనున్నా

Published On - Jul 29,2021 4:11 PM

Follow us
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?