US Police: భారత విద్యార్థిని జాహ్నవి మృతిపై ఎగతాళిగా మాట్లాడి, నవ్విన US పోలీసు.. ఊడిన ఉద్యోగం
ఆడెరర్ మాటలు కుటుంబానికి కలిగించాయి.. ఆ మాటలు తాము చెరిపివేయలేము. అయితే ఒకరి చావుని ఎగతాళి చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి చర్యలు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు మాత్రమే కాదు మొత్తం పోలీసు వృత్తికే అవమానం కలిగించాయని.. ఈ వ్యాఖ్యలు ప్రతి పోలీసు అధికారి పనిని మరింత కష్టతరం చేసిందని రహర్ పేర్కొన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థి కందుల జాహ్నవి మృతి తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ వ్యక్తుల జీవితం జీవితం కాదన్నట్లు ఆడెరర్ చేసిన వ్యాఖ్యలు.. నవ్విన నవ్వు మృతురాలి కుటుంబ సభ్యులను మాత్రమే కాదు ప్రతి ఒక్కరి మనసుని గాయపరిచేలా ఉన్నాయని సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ సూ రహర్ పేర్కొన్నారు. ఆడెరర్ మాటలు కుటుంబానికి కలిగించాయి.. ఆ మాటలు తాము చెరిపివేయలేము. అయితే ఒకరి చావుని ఎగతాళి చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి చర్యలు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు మాత్రమే కాదు మొత్తం పోలీసు వృత్తికే అవమానం కలిగించాయని.. ఈ వ్యాఖ్యలు ప్రతి పోలీసు అధికారి పనిని మరింత కష్టతరం చేసిందని రహర్ పేర్కొన్నారు.
“She had limited value..”, Seattle Police office, Daniel Auderer caught on a body camera last year laughing about the death of an Indian Student, Jaahnavi Kandula, terminated.
Vdo ctsy: Seattle Police pic.twitter.com/ptvp9dFsST
— Sidhant Sibal (@sidhant) July 18, 2024
అసలు ఏమి జరిగిందంటే..
2023 జనవరి 23న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి వీధి దాటుతుండగా సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొట్టింది. వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో జాహ్నవి 100 అడుగుల మేర కిందపడిపోయింది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ స్పందిస్తూ జాహ్నవి మరణంపై చాలా హేళనగా మాట్లాడడమే కాదు నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ అయ్యింది. జాహ్నవి ఓ సాధారణ వ్యక్తి.. అసలు మరణానికి విలువలేదు’ అని అడెరెర్ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడు ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. వెంటనే అడెరెర్ ను అప్పుడు సస్పెండ్ చేయగా.. తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకున్నారు.
పోలీసులకే అగౌరవం..
జాహ్నవి మృతిపై తమ డిపార్ట్మెంట్ అధికారి అడెరెర్ చేసిన వ్యాఖ్యలు మృతురాలి కుటుంబాన్ని తీవ్రంగా గాయపరచడమే కాదు సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చగా మారాయని పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ సూ రహర్ చెప్పారు. ప్రజల కోసం పోలీసు అధికారులు అని.. వారి విశ్వాసం కోల్పోకూడదని చెప్పారు. కనుక తప్పని సరిగా పోలీసులు ఉన్నత ప్రమాణాలను పాటించాలి.. ఈ నేపథ్యంలో అడెరెర్‌ను పోలీసు అధికారిగా విధుల్లో కొనసాగించడం డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని చెప్పారు. అందుకే ఆయన్ని ఉద్యోగంలో నుంచి తొలగించి నట్లు ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..