US Shooting: పాఠశాలలో యువతి కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి..

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ పెచ్చుమీరుతోంది. ఇటీవల కాల్పుల ఘటనలు పెరగడంతో.. పలు ప్రాంతాల్లో భయాందోన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న గురుద్వారాలో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే..

US Shooting: పాఠశాలలో యువతి కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి..
Shoot
Follow us

|

Updated on: Mar 28, 2023 | 7:09 AM

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ పెచ్చుమీరుతోంది. ఇటీవల కాల్పుల ఘటనలు పెరగడంతో.. పలు ప్రాంతాల్లో భయాందోన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న గురుద్వారాలో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే.. మరోసారి కాల్పులు కలకలం రేపాయి. యూఎస్ నాష్‌విల్లేలోని ఓ పాఠశాలలో యువతి కాల్పులతో రెచ్చిపోయింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. అనంతరం నిందితురాలిని పోలీసులు కాల్చి చంపారు. టెనెస్సీలోని ఓ ప్రైవేట్ క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తోన్న స్కూల్లో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇక్కడ 200 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రీ-స్కూల్ నుంచి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలు మాత్రమే ఉన్నారు. వీరంతా 3-4 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలే కావడంతో కాల్పుల మోతకు చిన్నారులు హడలిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న చిన్నారుల కుటుంబాలు తీవ్ర భయాందోళనరు గురయ్యాయి.

కాల్పులు జరిపిన 28ఏళ్ల యువతి దగ్గర రెండు అసాల్ట్‌ రైఫిల్స్‌, హ్యాండ్‌ గన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఫస్ట్‌ కాల్‌ అందుకున్న పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిపైనా కాల్పులు జరిపేందుకు యువతి ప్రయత్నించడంతో.. అక్కడికక్కడే పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు.

కాగా.. చనిపోయినవారిలో ముగ్గురు పిల్లలతోపాటు స్కూల్‌ స్టాఫ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..