AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిండు ప్రాణం తీసిన నల్లులు.. బతికుండగానే జైలు గదిలో నరకం అనుభవించిన ఖైదీ

అమెరికాలోని అట్లాంటాలో ఖైదీ (35) జైలు గదిలో మృతి చెందాడు. జైలు గదిలో నల్లులు కుట్టడం వల్లనే అతడు మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితుడి మృతిపై వెంటనే విచారణ జరపాలని, ఆ జైలును మూసివేయాలని డిమాండ్..

నిండు ప్రాణం తీసిన నల్లులు.. బతికుండగానే జైలు గదిలో నరకం అనుభవించిన ఖైదీ
Bed Insects
Srilakshmi C
|

Updated on: Apr 16, 2023 | 8:28 AM

Share

అమెరికాలోని అట్లాంటాలో ఖైదీ (35) జైలు గదిలో మృతి చెందాడు. జైలు గదిలో నల్లులు కుట్టడం వల్లనే అతడు మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితుడి మృతిపై వెంటనే విచారణ జరపాలని, ఆ జైలును మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. గతేడాది జూన్ 12న అక్రమంగా బ్యాటరీ ఛార్జ్‌ చేస్తున్నాడనే ఆరోపణలతో లాషాన్ థాంప్సన్‌ (35) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని ఫుల్టన్ కౌంటీ జైలుకు తరలించారు. అతని మానసిక అరోగ్యం సరిగ్గాలేదని గుర్తించిన అధికారులు సెప్టెంబర్ 13 మానసిక విభాగంలో ఉంచారు. 3 నెలల తర్వాత అతడు జైలు గదిలోనే అచేతనంగా పడి ఉన్నట్లు గమనించిన జైలు అధికారులు సీపీఆర్‌ చేశారు. స్పందించకపోవడంతో మృతి చెందినట్లు ధృవీకరించారు.

ఫుల్టన్ కౌంటీ జైలులోని అపరిశుభ్ర పరిస్థితుల వల్లే థాంప్సన్‌ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘సరైన సమయంలో అధికారులు స్పందించి ఉంటే థామ్సన్‌ బతికేవాడు. జైలులో ఖైదీలతోపాటు ప్రాణాలకు హానికలిగించే కీటకాలను కూడా ఉంచుతారా? నిర్లక్ష్యం ప్రదర్శించిన జైలు అధికారులు అక్కడ పని చేసేందుకు అర్హులు కాదు. వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. అతడి మరణానికి బాధ్యులు ఎవరో తేల్చాలని’ బాధితుడి కుటుంబం తరఫు న్యాయవాది డిమాండ్‌ చేశారు. ఫుల్టాన్‌ జైలులో పరిశుభ్రత లోపించడమే థామ్సన్‌ మృతికి కారణమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మృతుడి రక్తనమూనాలను పరీక్షించిన వైద్యులు బాధితుడి రక్తంలో నల్లుల రక్తనమూనాలు ఉన్నయని, అవితీవ్రంగా కుట్టడం వల్లే మరణించి ఉంటాడని అభిప్రాయపడ్డారు. ఐతే మృతికి గల స్పష్టమైన కారణాలు మాత్రం వెల్లడించలేదు. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు అట్లాంటా పోలీసులు వెల్లడించారు. సాధారణంగా నల్లులు కుట్టడం వల్ల ప్రాణంపోదు. కొన్ని అరుదైన సందర్భాల్లో నల్లులు అధికంగా రక్తం తాగడం వల్ల బాధితుల్లో రక్తహీణత ఏర్పడుతుంది. వెంటనే స్పందించి చికిత్స అందించకుంటే ప్రాణాంతకం కావచ్చని కెంటకీ యూనివర్సిటీకి చెందిన ఎంటమోలజిస్ట్‌ మైఖేల్ పాటర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.